రతన్ టాటా నిజమైన జాతీయవాది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

by Mahesh |   ( Updated:2024-10-10 03:52:26.0  )
రతన్ టాటా నిజమైన జాతీయవాది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: అనారోగ్యంతో బాధపడుతున్న టాటా ఇండస్ట్రీస్ అధినేత, రతన్ టాటా(Ratan Tata) బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌ కన్నుమూశారు. కాగా ఆయన మృతితో యావత్ భారత్ తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రతన్ టాటా మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన షా.. ఇలా రాసుకొచ్చాడు. "ప్రముఖ పారిశ్రామికవేత్త, నిజమైన జాతీయవాది అయిన రతన్ టాటా జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నిస్వార్థంగా మన దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. నేను అతనితో కలిసిన ప్రతిసారీ, భారత ప్రజల అభ్యున్నతి పట్ల అతని ఉత్సాహం, నిబద్ధత నన్ను ఆశ్చర్యపరిచాయి. మన దేశం, ప్రజల సంక్షేమం పట్ల అతని నిబద్ధత మిలియన్ల కలలను వికసించేలా చేసింది. కాలం రతన్ టాటాని అతని ప్రియమైన దేశం నుండి తీసివేయదు. ఆయన మన హృదయాలలో జీవించి ఉంటారు. టాటా గ్రూప్, దాని అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి శాంతి శాంతి" అని రాసుకొచ్చారు.

మహోన్నత నేత రతన్ టాటా మృతికి నివాళిగా.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రతన్ టాటా.. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం ఏక్ నాథ్ షిండే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అలాగే ఆయన అభిమానులు సామాన్య ప్రజల సందర్శనార్ధం ఉదయం 10.30 గంటలకు ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్ లో ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

Advertisement

Next Story

Most Viewed