- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
West Bengal: బెంగాల్‌లో భారీగా సీనియర్ వైద్యుల రాజీనామా.. జూనియర్ డాక్టర్ల దీక్షకు మద్దతు
దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో లైంగిక దాడి, హత్యకు గురైన బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే వారికి మద్దతుగా ఆర్జీకర్ ఆస్పత్రిలోని 50 మంది వైద్యులు రాజీనామా చేయగా.. తాజాగా మరికొన్ని ఆస్పత్రుల్లోని సీనియర్ వైద్యులు మూకుమ్మడిగా రిజైన్ చేశారు. కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 50 మంది, ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో 34, స్కూల్ ఆఫ్ మెడిసిన్, సాగూర్ దత్తా హాస్పిటల్ నుంచి 30 మంది, జల్పైగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి 19 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు.
అంతకుముందు రోజు కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి 70 మంది సీనియర్ వైద్యులు, నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ నుంచి 40 మంది తమ మూకుమ్మడి రాజీనామాలను సమర్పించారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వైద్య కళాశాలల నుంచి కూడా రానున్న రోజుల్లో సీనియర్ వైద్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తమ నిరసనను కొనసాగిస్తామని, ఆర్జీ కర్ కేసులో పోలీసులు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పుతామని, తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. కాగా, ఈ నెల 5 నుంచి ఆరుగురు జూనియర్ డాక్టర్లు ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.