మద్యం అమ్మకాలపై నిషేధం.. బొబ్బిలిగామలో గ్రామస్తుల తీర్మానం

by Kavitha |
మద్యం అమ్మకాలపై నిషేధం.. బొబ్బిలిగామలో గ్రామస్తుల తీర్మానం
X

దిశ, సదాశివపేట: గ్రామంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి బొబ్బిలిగామ గ్రామస్తులు ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. మండల పరిధిలోని బొబ్బిలిగామలో గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహించి, మద్యం అమ్మకాలు నిషేధించాలని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తీర్మానానికి విరుద్దంగా గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.10 వేలు, కొన్న వారికి రూ. 5 వేలు జరిమానా విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు వీర రెడ్డి, ఉప సర్పంచ్ సురేష్, గ్రామ నాయకులు, యువకులు, మహిళలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story