- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్లర్ (వీసీ) గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ యాదగిరి రావ్ ను సారంగాపూర్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాల అధ్యాపక బృందం, కళాశాల ప్రిన్సిపాల్ తో కలిసి వీసీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. బీఈడీ కళాశాలలోని విద్యార్థుల హాజరు శాతం, ప్రస్తుతం నడుస్తున్న కార్యక్రమంపై అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం బీఈడీ విద్యార్థుల ప్రీ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం నడుస్తున్నందున త్వరలోనే సారంగాపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ను తప్పక సందర్శిస్తానని హామీ ఇచ్చారు. అందరూ కలిసి అభివృద్ధిలో భాగస్వాములమవుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సాయిలు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వన్నెల్ దాస్ శ్రీనివాస్, సీనియర్ ఆధ్యాపకుడు డాక్టర్ ఆర్. కరుణాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్. రవీందర్, సువర్చల, పోలపల్లి శ్రీకాంత్, హరిత, గణేష్ పాల్గొన్నారు.