ఆర్మూర్ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..

by Sumithra |
ఆర్మూర్ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
X

దిశ, ఆర్మూర్ : వ్యాపారం చేస్తూ సమాజ సేవ చేస్తున్న తాను రాజకీయాల్లో వస్తే తప్పేమిటని, ఆర్మూర్ ప్రాంత ప్రజలకు సేవచేసేందుకే అన్ని అనుకూలిస్తే రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ వ్యాపారవేత్త పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామంలోని రాకేశ్ రెడ్డి స్వగృహంలో సోమవారం ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానుల, సన్నిహితుల కోలాహలం మధ్యఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను ఆర్మూర్ నియోజకవర్గ సొంత బిడ్డనని.. ఆర్మూర్ లోని అంకాపూర్ లో పుట్టి పెరిగానని, ఆర్మూర్ లోనే చదువుకున్నానని, నేను పేదరికం ఏంటో తెలిసిన వాడినని చెప్పారు.

పుట్టిన గ్రామానికి, ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తనతోపాటు సన్నిహితులను కలిసి జన్మభూమి కార్యక్రమాన్ని చేపడతానన్నారు. ప్రజాసేవ చేయడం తప్ప తనకు మరో ఉద్దేశం లేదన్నారు. డబ్బుంటే దాచుకోవడానికి కాదని, పదిమందికి ఆసరాగా నిలిచి పంచి పెట్టడం కోసం వాడాలన్నారు. సికింద్రాబాద్ లో రూ.10 కోట్ల భవనాన్ని 1 రూపాయికి వైద్యం కోసం నైన్ స్టార్ హెల్త్ కేర్, జీజీ హెల్త్ చారిటీ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు. రాజకీయాలలో ప్రజలను ప్రేమగా చూడాలని, తండ్రిలాగా సేవచేయడానికి తపన పడాలన్నారు. ఇక్కడ మాత్రం భయంతో ప్రజలు బతుకుతున్నారని రాకేష్ రెడ్డి అన్నారు.

అనేక మందికి ఎన్నో ఒత్తిళ్లు వచ్చిన ఎదిరించి తనపుట్టిన రోజు సందర్భంగా ఆశీర్వదించడానికి వచ్చిన అభిమానులు, సన్నిహితులకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రజలకు సేవచేసేందుకే రాజకీయాల్లోకి వస్తానని, ప్రజాజీవితంలోకి వచ్చినంక అవసరమైతే చావడానికైనా రాకేష్ రెడ్డి సిద్ధమన్నారు. రాజకీయాల్లో రావాలని అనుకుంటే ప్రజలలో రాజకీయ నాయకుల పట్ల ఉన్న భయాన్ని తొలగిస్తానన్నారు. ఆర్మూర్ ప్రాంతంలోనే ఉండి ప్రజలకు సేవచేయాలను కుంటున్నట్లు స్పష్టం చేశారు.

అంతకుముందు పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్, 1 రూపాయికే కార్పొరేట్ వైద్యం, నైన్ స్టార్ హెల్త్ కేర్, జీజీ హెల్త్ చారిటీ ఆసుపత్రి లోగోలను రాకేష్ రెడ్డి ఆవిష్కరించారు. రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులకు తినిపించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కూతురు పైడి సుచరిత రెడ్డి, మాజీ సర్పంచ్ లు పెద్ద రాజన్న, చిన్నరాజన్న, సురేష్ రెడ్డి, మోహన్, సాగర్, కుటుంబ సభ్యులు, ఆర్మూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.

నియోజకవర్గ వ్యాప్తంగా రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు..

ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అభిమానులు సన్నిహితులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పండ్లు, పుస్తకాలను, పెన్నులను పంపిణీ చేశారు. విద్యార్థులకు కావలసిన పరీక్ష సామాగ్రిలను, పలు పాఠశాలల్లో కంప్యూటర్లను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంచిపెట్టారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలను నిర్వహించి యువకులు రక్తదానం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, సన్నిహితులు నా పుట్టినరోజు సందర్భంగా చేసిన కార్యక్రమాలకు సదారుణపడి ఉంటానని వారికి రాకేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed