ఉపాధి హామీ సామాజిక ప్రజావేదికలో…ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు

by Kalyani |
ఉపాధి హామీ సామాజిక ప్రజావేదికలో…ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు
X

దిశ, నిజాంసాగర్: నిజాంసాగర్ మండలంలో 14వ విడత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సామాజిక ప్రజావేదిక తనిఖీలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని మండల కార్యాలయం ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. జిల్లా సామాజిక తనిఖీ ప్రిసైడింగ్ అధికారి, అడిషనల్ డీఆర్డిఓ వామన్ రావు హాజరయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనికి గాను తనిఖీ నిర్వహించారు. మొత్తం రెండు కోట్ల నలభై లక్షల రూపాయల పనులు చేపట్టినట్లు తనిఖీ బృందం తెలిపారు. ఈనెల 11 నుంచి 18వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు.

గ్రామ సభలలో వచ్చిన అంశాలను మాస్టర్లలో తేడాలను, పనుల నాణ్యతను , తదితర అంశాలను ప్రజా వేదికలో చదివి వినిపించారు. సింగీతం గ్రామంలో 1430 రూపాయలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆయా గ్రామాలకు చెందిన మాస్టర్లలో, ఎంపీలలో జరిగిన పొరపాట్లను సరి చేసుకోవాలని సంబంధిత ఎఫ్ఏ ,టిఏలకు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డిఓ వామాన్ రావు,విజిలెన్స్ అధికారి ప్రశాంత్,దేవేందర్,ఎంపీడీఓ గంగాధర్,ఎపీఓ శ్రీనివాస్, చంద్రశేఖర రావు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు,పలు గ్రామాల ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed