ఉపాధి హామీ డబ్బులు విషయంలో తీవ్ర గందరగోళం

by Mahesh |
ఉపాధి హామీ డబ్బులు విషయంలో తీవ్ర గందరగోళం
X

దిశ, గాంధారి: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్టు ఉంది ఉపాధి హామీ కూలీల పరిస్థితి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కేంద్రంలోని 44 గ్రామపంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 100 రోజుల ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే డబ్బులు మాస్టర్ల ద్వారా నింపి, రోజు రోజున ఆన్లైన్ లో అప్డేట్ చేసి, పనిచేసిన దినాలతో సహా పూర్తి వివరాలు పంపించామని ఉపాధి హామీ అధికారులు తెలపడం జరిగింది. ఎండనక వాననక పనిచేసి ఆన్లైన్ ద్వారా ఫోటో దిగివచ్చిన రోజులు చాలానే ఉన్నాయి. అయితే చేసిన పనికి డబ్బులు రాక ఉపాధి హామీ కూలీలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పని చేసేదాకా ఒక బాధ, డబ్బులు వచ్చేదాకా ఇంకో బాధ అన్నట్టు ఉందని ఉపాధి హామీ కూలీలు తమ గోడును వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి హామీ అధికారులను వివరణ కోరగా మా నుంచి ఎలాంటి తప్పు లేదని, మా పని మేము పూర్తిగా చేశామని జవాబు ఇచ్చారు. ఉపాధి హామీ కూలీల అకౌంట్లో డబ్బులు పడకపోవడానికి గల కారణం వాళ్ళ యొక్క సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం ద్వారా ఆలస్యం అవుతుందని, అంతేకాకుండా పింఛన్లు, ఉపాధి హామీ డబ్బులు ఒక్కసారిగా రావడంతో నగదుల ఉపసంహరణ కొద్దిగా ఆలస్యం అవుతుందని, కొంతమందికి డబ్బులు అకౌంట్లో చూపించడం లేదని వాపోతున్నారు. 2021 సంవత్సరం నుంచి 2024 వరకు జరిగిన ఉపాధి హామీ పనులలో కొన్ని అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. ప్రతిరోజు 30 మంది అకౌంట్లను ఫ్రీజింగ్ నుంచి రిలీజ్ చేసేందుకు మాత్రమే పరిమితి ఉందని బ్యాంక్ అధికారులు తెలిపారు.

గాంధారి మండలం నాగులూర్ తండాకు చెందిన బౌసింగ్ తన ఉపాధి హామీ డబ్బులు గత నాలుగు సంవత్సరాల నుండి తీయడం లేదని ఆ డబ్బులు ఒక్కసారిగా జమ చేసి ఏదైనా పనికి ఉపయోగిద్దామని అలాగే ఉంచుకున్నాడు. అయితే 2021 నుండి 2024 వరకు అతను పోస్ట్ ఆఫీస్‌కు రాలేదు. నగదు ఉపసంహరణ చేయలేదు. ఇటీవల పోస్ట్ ఆఫీస్ బుక్ తీసుకుని వెళ్లగా ఉపాధి హామీ డబ్బులు 5000 ఉన్నాయని మిగతావి తొందరలోనే వస్తాయని పోస్ట్ ఆఫీస్ అధికారి తెలిపినట్టు బౌసింగ్ తెలిపారు. తమకు దాదాపు కుటుంబంలో అందరికీ కలిసి నాలుగు సంవత్సరాల నుండి ఒక్క పైసా కూడా తీయకుండా అలాగే ఉంచామని ఇప్పుడేమో అందరి అకౌంట్లో 2000, 3000 ఇలా కనిపిస్తున్నాయని వాపోయాడు.

ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఉపాధి హామీ డబ్బులు ఎప్పుడో చెల్లించాం-ఈసీ మహేష్

ఉపాధి హామీ కూలీల డబ్బుల విషయమై ఉపాధి హామీ ఈసీ మహేష్ ను వివరణ కోరగా... ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 9 ఫిబ్రవరి 2024 వరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, డబ్బులు కూడా ఉపాధి హామీ కూలీలకు కొంతమందికి వచ్చాయని ఇంకొంతమందికి రాలేదని, దీనికి గల కారణం పోస్ట్ ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం వల్ల ఈ పొరపాటు జరిగి ఉండవచ్చని తెలిపారు.

కొన్ని అకౌంట్లు ఫ్రీజ్ అయిన మాట వాస్తవమే- తపలాధికారి రవీందర్

ఉపాధి హామీ కూలీలు నగదు ఉపసంహరణ చేసుకొని కొంతమంది 2021 లో తీసుకొని 2024 లో తీసుకుని కొంతమంది కూలీలకు డబ్బులు జమ అవడంలో.. కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతున్నాయని తపాలా శాఖ అధికారి రవీందర్ తెలిపారు. అంతేకాకుండా దాదాపు 100 మందికి పైగా ఇలాంటి సమస్యలు ఎదురు కాగా ఇప్పటికీ 70 మంది వరకు సమస్యలు పరిష్కరించామని త్వరలోనే అందరి సమస్యలు పరిష్కారం అవుతుందని, ఇంకా పరిష్కారం కానీ ఉపాధి హామీ కూలీలు తమ యొక్క పోస్ట్ ఆఫీస్ బుక్‌ని తీసుకొని ఆఫీసుకు వస్తే.. త్వరలో పరిష్కారం అయ్యేలా చూస్తామని అన్నారు. పోస్ట్ ఆఫీస్‌లో కొంతమందికి అకౌంట్లో ఫ్రిజ్ ఐన నగదు ఉపసంహరణ జరగడం లేదని అంతేకాకుండా ఇందులో రోజుకు 30 మంది అకౌంట్ల ఫ్రీజింగ్ గురి అయిన బాధితులకు ఈ కేవైసీ చేయడం, సర్వర్ డౌన్ ఉండటం వల్ల ఈ సమస్య ఎదురవుతుందని, కొంతమంది అదనంగా డబ్బులు తీసుకున్న వారు కూడా ఉన్నారని అలాంటివారికి తదుపరి వచ్చే డబ్బులు అందులో కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇస్తామని తపాలా అధికారి వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed