- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో రాక్షసపాలన రాజ్యమేలుతుంది..
దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహిస్తున్న బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం కొనసాగింది. ఈ సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యంతో జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబాటుకు గురైందని నిండు అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల మంది మా కుటుంబ సభ్యులే అని చెప్పిన కేటీఆర్ కు జుక్కల్ నియోజకవర్గంలోని పేద ప్రజలకష్టాలు కంటికి కనిపించడం లేదా అంటూ విమర్శించారు.
ప్రజాప్రతినిధులకు సైతం డబల్ బెడ్ రూమ్ లు అందలేని పరిస్థితి చుక్కనియోజకవర్గంలో ఉందని అలాగే నిజాంసాగర్ మండలంలో ఇచ్చిన దళిత బందు యూనిట్లు అవసరాల దృష్ట్యా కాకుండా బలవంతంగా కట్టబెట్టారని అన్నారు. వాటిని ఏం చేసుకోవాలో అర్థం కాక ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు కవర్లు కప్పిఉంచుకుంటున్నారని ఉపయోగంలేని యూనిట్లతో ఎవరికి లాభం అంటూ దుయ్యబట్టారు. జుక్కల్ నియోజకవర్గంలోని అన్నిమండలాల అర్హులకు దళిత బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కంటివెలుగు పథకం కేవలం ఒక బూటకం ప్రభుత్వం ఆడుతున్న నాటకం అంటూ విమర్శించారు.
కంటి వెలుగు పథకం కేవలం వృద్దులు కారు గుర్తు సింబల్ ను గుర్తించలేక కారు గుర్తును పోలిన ఇతర గుర్తులకు ఓటేస్తున్నారని భయంతోనే కంటివెలుగు పథకాన్ని ప్రారంభించారని దానివల్ల నిజానికి ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల సమస్యలను తీర్చిపెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే మంజూరు చేయలేనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఉద్యమానికి త్వరలోనే కార్యచరణను ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బీ.బాలరాజ్ జిల్లా నాయకులు సురేష్ గౌడ్, జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జి ఈ బాత్ వార్ తుకారం, గులాని సాయిలు, బొగడ మీది సాయిలు తదితరులు పాల్గొన్నారు.