ఖద్దర్ బట్టలని చూడొద్దు... గరీబ్ లను చూడాలి

by Sridhar Babu |
ఖద్దర్ బట్టలని చూడొద్దు... గరీబ్ లను చూడాలి
X

దిశ, భిక్కనూరు : తెల్ల ఖద్దర్ బట్టలు వేసుకున్నారని చూడకుండా కార్యాలయానికి వచ్చిన పేద ప్రజలకు ముందుగా పని చేసి పెట్టాలని మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ అధికారులకు సూచించారు. శనివారం రాత్రి బీబీపేట మండల కేంద్రంతోపాటు భిక్కనూరు మండలం అంత పల్లి గ్రామంలో జరిగిన ప్రజా పాలన గ్రామ సభలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గరీబులకు సంక్షేమ పథకాలు అందే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అధికారులు కూడా సూటు బూటు వేసుకున్న వారని చూడకుండా, పేదలకు ముందుగా పనులు చేసిపెట్టే విధంగా సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన నాలుగు గ్యారంటీలను వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా గడవకముందే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాత్రి 9 గంటలు అవుతున్నా ప్రజా పాలన దరఖాస్తులు చేసేందుకు ప్రజలు ఏ విధంగా క్యూలో నిలబడ్డారని, రాష్ట్రవ్యాప్తంగా అంతట ఇదే పరిస్థితి నెలకొందన్నారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలోని పార్లమెంటు స్థానాలను గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చిట్టెడి మధుమోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు టీపీసీసీ కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఎన్ఆర్ఐ సెల్ జిల్లా కన్వీనర్ చిట్టెడి సుధాకర్ రెడ్డి, బీబీపేట, భిక్కనూరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుతారి రమేష్, తిరుపరి భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, ఎంపీడీవో అనంతరావు, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story