- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డీఎస్ పేరిట వచ్చిన లేఖలను నమ్మవద్దు.. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మపురి శ్రీనివాస్ తన సొంత ఇంటికి వచ్చిన ఆనందాన్ని పొందుతున్నారని కానీ కొందరు జీర్ణించుకోలేక ఆయన పేరిట ఫేక్ లేఖలు బయటపెడుతున్నారని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. సోమవారం డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన సతీమణి విజయలక్ష్మీ విడుదల చేసిన లేఖలపై సంజయ్ మీడియాతో మాట్లాడారు. డీఎస్ ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారని, సాంకేతిక కారణాలతోనే పార్టీలో చేరడం ఆలస్యమైందన్నారు. డీఎస్ లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని ప్రజలు, పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారని అన్నారు.
డీఎస్ పార్టీలో చేరడం ఇష్టం లేదని అందుకే ఆయన పేరిట లేఖలు విడుదల చేస్తున్నారన్నారు. డీఎస్ ప్రస్తుత పరిస్థితుల్లో లేఖలు రాసే స్థితిలో లేరని కావాలని కొందరు పని గట్టుకుని వీడియోలు తీసి లేఖ రాసినట్లు బహిర్గతం చేశారని అన్నారు. లేఖ విడుదల చేసిన తన తల్లి విజయలక్ష్మీని రాజకీయాల్లోకి లాగవద్దని కోరారు. తన తల్లికి ఏనాడు రాజకీయాల గురించి గానీ, కుటుంబ వ్యవహరాల గురించి బయటకు రాలేదని సంజయ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం ఇచ్చిన సోనియగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గె, రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావు , పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు సెల్ ఫోన్ లో తన తండ్రితో ధర్మపురి సంజయ్ ఫోన్ లో యోగాక్షే మాలను తెలుసుకున్నారు. ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అని ప్రశ్నించారు. పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఉందని డీఎస్ సంజయ్ ను వివరణ కోరడం విశేషం. ప్రజల నుంచి, నాయకుల నుంచి మంచి స్పందన ఉందని సంజయ్ జవాబు ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా ఒత్తిడికి గురి చేసినా తనకు చెప్పాలని సంజయ్ తండ్రిని కోరారు. వచ్చే వారం నిజామాబాద్ వస్తానని డీఎస్ ఫోన్ లో తెలిపారు.