- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JEE-Advanced Exam: ఐఐటీల్లో చదువుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్షను మూడేళ్లు రాసుకునే ఛాన్స్..!
దిశ, వెబ్‌డెస్క్: ఐఐటీల్లో చదువుకోవాలనుకునే వారికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని ప్రతి ష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IIT), ఎన్‌ఐటీ(NIT)ల్లో బీటెక్(B.Tech) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్(JEE-Advanced) పరీక్షను ఇక నుంచి మూడేళ్లు రాసుకునే అవకాశం కల్పించింది. ఇదివరకు ఈ పరీక్షను వరుసగా రెండు సంవత్సరాలు(Two Years) మాత్రమే రాసే ఛాన్స్ ఉండగా తాజాగా దాన్ని మూడు సంవత్సరాలకు(Three Years) పెంచుతూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. దీంతో 2022-23లో ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి కూడా ఈసారి జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం లభించింది. ఈ విషయాన్ని అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష నిర్వహణ బాధ్యతను తీసుకున్న ఐఐటీ కాన్పూర్(IIT Kanpur) వెల్లడించింది.
అయితే ఈ పరీక్షకు అప్లై చేసుకునే అభ్యర్థులు 2000 అక్టోబర్ 1 తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు(Age Relaxation) ఉంటుందని పేర్కొంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాదించాలంటే అభ్యర్థులు ముందుగా జేఈఈ-మెయిన్స్ ఎగ్జామ్(JEE-Mains Exam)లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇందులో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ పరీక్షకు సెలెక్ట్ చేస్తారు. అయితే అడ్వాన్స్‌డ్-2025 ఎగ్జామ్ తేదీని ఐఐటీ కాన్పూర్ ఇంకా అధికారంగా ప్రకటించలేదు. ఈ పరీక్షను ప్రతి ఏడాది మే మూడు లేదా నాలుగో వారంలో కండక్ట్ చేస్తారు. కాగా అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష సిలబస్ లో ఎటువంటి చేంజెస్ లేవని ఐఐటీ కాన్పూర్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.