దిశ ఎఫెక్ట్...సెల్ ఫోన్ శాడిస్ట్ రిమాండ్

by Sridhar Babu |   ( Updated:2024-03-01 14:28:12.0  )
దిశ ఎఫెక్ట్...సెల్ ఫోన్  శాడిస్ట్ రిమాండ్
X

దిశ, భిక్కనూరు : ట్రూ కాలర్ ఆధారంగా మహిళలకు ఫోన్లు చేస్తూ, ఆ తరువాత అసభ్యకర మెసేజ్ లు చేస్తూ టార్చర్ చేస్తున్న యువకుడిని శుక్రవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీసులు అరెస్టు చేశారు. విషయమై దిశ జిల్లా టాబ్లాయిడ్ లో వరుస కథనాలు రావడంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ సింధు శర్మ ఎలాగైనా సెల్ ఫోన్ శాడిస్ట్ ను పట్టుకొని అరెస్టు చేయాలని ఆదేశించారు. దాంతో స్థానిక పోలీసులు శాడిస్ట్ సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ముందుగా అడ్రస్ గుర్తించారు. ఆ తర్వాత రెండు రోజులకు స్పెషల్ టీం సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రావు కర్నూల్ వెళ్లి ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ హోటల్లో పని చేసే షేక్ మహబూబ్ బాషా తన ఫోన్ నుంచే కాకుండా, తన స్నేహితుని ఫోన్ ను కూడా తీసుకొని మాట్లాడడమే కాకుండా

అసభ్యకర మెసేజ్ లు పెడుతూ మహిళలను టార్చర్ చేసినట్లు గుర్తించారు. స్నేహితున్ని ముందుగా పట్టుకున్న పోలీసులకు, అసలు నిందితుడు ఫోన్ శాడిస్ట్ బాష పోలీసుల కళ్లు గప్పి పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రత్యేక టీం సభ్యులు మాత్రం చాకచక్యంగా వ్యవహరించి టెలిఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేసి పట్టుకున్నారు. ఇద్దరి ని అదుపులోకి తీసుకొని పట్టుకొచ్చారు. స్టేషన్ లో విచారించిన అనంతరం బాష ఒక్కడే వేధించాడని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈ సందర్భంగా భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్ ఐ సాయికుమార్ లు మాట్లాడుతూ ఎవరైనా అసభ్యకర మెసేజ్ ల తో పోస్టులు పెడుతూ, ఫోన్లు చేస్తూ వేధిస్తే తమకు ఫిర్యాదు చేయవచ్చని, లేదంటే నేరుగా 100కు డయల్ చేయాలని, బాధితులు ఏమాత్రం భయపడవద్దని బాధిత మహిళలకు భరోసా కల్పించారు.

Advertisement

Next Story

Most Viewed