- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Savitri Jindal: హర్యానాలో బీజేపీకి పెరిగిన బలం
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. 48 స్థానాల్లో విజయం సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కాగా.. హర్యానా నుంచి గెలిచిన ముగ్గురు స్వతంత్రులు కూడా బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థుల్లో భారత్ సంపన్న మహిళా నేత సావిత్రి జిందార్ కూడా ఉన్నారు. ఈవిడతో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా దేవేందర్ కడ్యాన్, రాజేశ్ జూన్ లు గెలుపొందారు. వారందరూ బీజేపీ అధిష్ఠానంతో భేటీ అయ్యారు. హర్యానా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో కడ్యాన్, రాజేశ్ జూన్‌లు ఆ పార్టీలో చేరారు. ఇక సావిత్రి జిందాల్ ఆ పార్టీకి మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా..
ఇకపోతే, సావిత్రి జిందాల్ 2005, 2009లో హిస్సార్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆవిడ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఈసారి ఆమె బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆమెకు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక, బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆమె బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక మరో స్వతంత్ర ఎమ్మెల్యే కడ్యాన్ కూడా బీజేపీ రెబల్ గా బరిలో దిగి గనౌర్ నుంచి గెలుపొందారు. రాజేశ్ జూన్ బహదూర్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థిపైనే గెలవడం గమనార్హం. విజయం సాధించారు.