- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడుపాయల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తాం..: ఎమ్మెల్యే రోహిత్ రావు
దిశ, పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. ఏడుపాయల్లో కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు బుధవారం కుటుంబ సమేతంగా పాల్గొని సరస్వతీ మాత అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. వారు ఏడుపాయల గోకుల్ షెడ్ కు చేరుకోగానే ఆలయ పూజారులు, కార్యనిర్వాణాధికారి చంద్రశేఖర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకున్న దంపతులు కుంకుమార్చనలో పాల్గొన్నారు.
గోకుల్ షెడ్ లో ప్రత్యేక పూజల అనంతరం రాజగోపురంలో ప్రతిష్టించిన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ రావు మాట్లాడుతూ.. మెదక్ ప్రాంతం ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, నాయకులు ఆకుల శ్రీనివాస్, నిట్టలాక్షప్ప, గణేష్, నగేష్, రాజశేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.