Doctors Resign: కోల్ కతా ఘటన.. 60 మంది వైద్యులు రాజీనామా

by Y.Nagarani |
Doctors Resign: కోల్ కతా ఘటన.. 60 మంది వైద్యులు రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాలోని కోల్ కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి (RG kar Medical College and Hospital)లో వైద్య విద్యార్థినిపై ఆగస్టు 9న జరిగిన హత్యాచార ఘటన దేశమంతా ఎంతటి సంచలనానికి దారితీసిందో తెలిసిందే. రెండునెలలైనా ఈ కేసులో నిందితుడికి ఇంకా శిక్షపడలేదు. ఆమెకు న్యాయం చేయాలని, వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహారదీక్షకు మద్దతుగా.. తాజాగా కలకత్తా మెడికల్ కాలేజీకి చెందిన 60 మంది సీనియర్ డాక్టర్లు రాజీనామాలను సమర్పించారు. నిన్న ఆర్జీకర్ ఆస్పత్రికి చెందిన 50 మంది వైద్యులు, లెక్చర్ స్టాఫ్ మూకుమ్మడి రాజీనామాలు చేయగా.. వారంతా తమ రాజీనామా పత్రాలపై సంతకాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

హత్యాచార ఘటన వెలుగుచూసినప్పటి నుంచి ఆమెకు న్యాయం చేయాలని మెడికల్ స్టూటెండ్స్ నిరసనలు చేపట్టగా.. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తితో నిరసన విరమించారు. తమ డిమాండ్లను తీరుస్తామని హామీఇవ్వగా.. 42 రోజులకు నిరసన విరమించి.. సెప్టెంబర్ 21న విధుల్లో చేరారు. తమ డిమాండ్లకు తగ్గట్టుగా సానుకూల చర్యలులేవని, మృతురాలికి న్యాయం జరగాలంటూ.. మళ్లీ ఏడుగురు జూడాలు నిరాహార దీక్షకు దిగారు. వారికి మద్దతుగానే వైద్యులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఇప్పటి వరకూ 110 మంది సీనియర్ వైద్యులు రాజీనామా పత్రాలను సమర్పించారు.

Advertisement

Next Story

Most Viewed