ఎంతో ప్రత్యేకమైన ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం: సీఎం చంద్రబాబు నాయుడు

by Mahesh |   ( Updated:2024-10-09 10:14:08.0  )
ఎంతో ప్రత్యేకమైన ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం: సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు కుటుంబ సమేతంగా బెజవాడకు చేరుకున్న సీఎం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమం అనంతరం బయటకు వచ్చిన సీఎం.. మీడియాతో మాట్లాడారు. " దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. మూలా నక్షత్రం రోజున అమ్మవారికి దర్శించుకోవడం నా అదృష్టం అని చెప్పుకొచ్చారు. చెడుపై మంచి సాధించినందువల్ల దసరా పండుగను పెద్ద ఎత్తున్న చేసుకుంటామని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో తిరుమల తర్వాత 2వ అతి పెద్ద దేవాలయం ఇంద్రకీలాద్రి అని.. అన్ని దేవాలయాల్లో పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ఉత్సవ కమిటీకి బదులుగా సేవా కమిటీ వేశామని చెప్పుకొచ్చారు. అలాగే దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ దుర్గమ్మను ఇప్పటి వరకు 5 లక్షల 80 వేల మంది దర్శించుకున్నారని.. ఈ సారి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చామని, వీఐపీలు ఎవరు వచ్చిన సామాన్య భక్తులను ఆపకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని.. దీంతో సామాన్య భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story