11 వేల ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |   ( Updated:2024-10-09 12:05:38.0  )
11 వేల ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). బుధవారం ఎల్బీ స్టేడియంలో 11 వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చుకున్నదే కొలువుల కోసం అయితే కేసీఆర్ కుటుంబంలో కొలువుల కోసం మాత్రమే తెలంగాణ తెచ్చుకున్నట్టు చేశారని మండిపడ్డారు. నిరుద్యోగుల గురించి కనీస ఆలోచన చేయకుండా వారి కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లను అడ్డుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, కానీ తెలంగాణ ప్రజలు, న్యాయం మావైపు ఉందని తెలిపారు.

మిమ్మల్ని చూస్తే దసరా పండుగ ముందే వచ్చినట్టు సంతోషంగా ఉందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. కొలువు పొందిన ఉపాధ్యాయుల మీద చాలా బాధ్యత ఉందని పేర్కొన్న సీఎం.. భవిష్యత్తులో టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఎం, పీఎంలను తయారు చేసేది మీదే అని గుర్తు చేశారు. తెలంగాణలో 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.., 10 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు ఉందని, ఎంతకష్టమైన సరే ప్రైవేట్ పాఠశాలకు మాత్రమే పంపేందుకు ఆసక్తి చూపిస్తున్నారని.. దీనికి కారణం మీరే వెతికి పరిష్కరించాలని సీఎం సూచించారు.

పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అందించి వాటిని తీర్చదిద్దాము అన్నారు. అన్ని రకాల రెసిడెన్షియల్ స్కూళ్లను తీసేసి అందరు విద్యార్థులు ఒకేచోట చదువుకునేలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. ఈపాటికే 25 నియోజక వర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలోరూ.125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మించేందుకు పనులు మొదలవనున్నాయని పేర్కొన్నారు. ఎన్నడూ లేనంతగా విద్యాశాఖకు రూ. 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చేశారు.

Advertisement

Next Story