- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
దిశ,కొత్తూరు : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమం అనంతరం పెద్దమ్మ తండా రోడ్డు అభివృద్ధికి కృషి చేయాలనీ గిరిజనుల ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎస్సీ ఎస్టీలకే సబ్ ప్లాన్ నిధుల వినియోగం ఉంటుంది అని అన్నారు.గతంలో సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించడం వల్లే తండాలు అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కొత్తూరు మున్సిపాలిటీలో రహదారుల అభివృద్ధికి అందరు సహకరించాలన్నారు. పూలే చౌరస్తాలో డబ్బాల తొలగింపుపై పార్టీల నేతలంతా కూర్చొని మాట్లాడుకోవాలన్న సూచించారు.
కాలువ నిర్మాణం అనంతరం డబ్బాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని త్వరలోనే బస్ స్టాప్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొత్తూరు మండల అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, మునిసిపాలిటీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ లావణ్య, కొత్తూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు, నాయకులు దేవేందర్,పాశం కృష్ణ,సురేందర్,మహేందర్,జగన్,శ్రీనివాస్ చారి,చిల్కమర్రి నరసింహ,విక్రమ్, కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.