డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన..

by Sumithra |
డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన..
X

దిశ, నవీపేట్ : విద్యార్థులకు ఆకర్షణీయమైన డిజిటల్ బోధన చేయడానికి అవసరమైన ప్రొజెక్టర్ ను మంగళవారం ఎంఈఓ గణేష్ రావు ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఆర్టియూ మండల ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఆలోచన మేరకు పాఠశాలలో డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన చేయుటకు ప్రొజెక్టర్ ను ఏర్పాటు చేయడం అభినందించ దగ్గ విషయమని మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు అన్నారు. విద్యార్థులకు మానసిక వికాసాన్ని పెంచే ఆట వస్తువులతో పాటు శారీరక పెరుగుదలకు ఉపయోగపడే ఆట వస్తువులను సైతం తీసుకురావడం అభినందనీయమన్నారు.

ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ అధికారి శ్రీమతి విమల స్వరూప రాణి, పాఠశాలల సముదాయ ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షులు హనుమరెడ్డి, రాష్ట్ర ప్రధాన అసోసియేట్ అధ్యక్షులు రచ్చమురళి, సంతోష్ యాదవ్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు రాధా, మండల అసోసియేట్ అధ్యక్షులు అబ్దుల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాకేష్ రెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ నవీన్ ఉపాధ్యాయురాలు లలిత, సుస్మిత, శైలజ, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed