గృహలక్ష్మి లబ్ధిదారుల ధర్నా

by Sridhar Babu |
గృహలక్ష్మి లబ్ధిదారుల ధర్నా
X

దిశ, బీంగల్ : గత బీఆర్​ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా గృహలక్ష్మి లబ్ధిదారులు బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ లబ్ధిదారులు బుధవారం భీంగల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఎర్గట్ల, మోర్తాడ్, కమ్మర్ పల్లి మండలాల్లో ఆయా మండల తహసీల్దార్ ఆఫీస్ ల ముందు లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు.

ధర్నా అనంతరం ఆయా మండలాల తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణంకు గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు మంజూరు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి లబ్దిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మిని రద్దు చేస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చే గృహనిర్మాణ పథకం లో మొదటి విడతలో లబ్ధిదారులందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి బీఆర్ ఎస్ పార్టీ మద్దతు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed