- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పచ్చి మోసగాడు.. దన్ పాల్ సూర్యనారాయణ
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తమ హక్కుల కోసం ధర్నాలు చేస్తున్న వీఆర్ఏలను రోడ్డుకు లాగిన ముఖ్యమంత్రి , మంత్రులు విలాసవంతమైన భవనాల్లో హాయిగా గడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దన్ పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని వీఆర్ఏలకు మంగళవారం బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అమలు చేస్తామని, ఉద్యోగంలో చేరిన వెంటనే 13వేల వేతనాన్ని ఇచ్చి సమయానుసారం పెంచుతామని, మృతి చెందిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు వారి అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, విద్యార్హతలు ఉన్న వారికి వారి అర్హతలను బట్టి ప్రమోషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి 2017, 2022 సంవత్సరంలో ప్రకటించారని గుర్తు చేశారు.
ఈ హామీలను తుంగలో తొక్కిన తెరాస ప్రభుత్వం 72 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్ఏలను కనీసం మాట్లాడించిన పాపాన పోలేదని ద్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పథకాలను తీసుకొచ్చి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందేలా చూస్తుందని అన్నారు. రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలు తీర్చలేని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని ఏలుతానంటూ కొత్త జాతీయ పార్టీ పెడతానంటూ ప్రగల్బాలు పలుకుతున్నాడని, రానున్న కాలంలో ఆయనకు పరాభవం తప్పదన్నారు.
కేవలం తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని తపనతో జాతీయ పార్టీ అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని ధన్ పాల్ విమర్శించారు. ఈ సందర్భంగా నగరంలోని వీఆర్ఏలకు నిత్యవసర సరుకులను అందజేశారు. భవిశ్యత్ లో వీఆర్ఏ లకు అండగా మా ట్రస్ట్ ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, గడ్డం రాజు, బట్టి కారి ఆనంద్, భూపతి, మఠం పవన్, రోషణ్ లాల్ బోర, మాస్టర్ శంకర్, ఎర్రం సుదీర్, ఇప్పకాయల కిషోర్, అమందు విజయ్, శివనూరి భాస్కర్, భాస్కర్ రెడ్డి, రాకేష్, ఆశిష్, పవన్ పట్టేవారు ఉన్నారు.