ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపే..

by Sumithra |
ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపే..
X

దిశ, నవీపేట్ : రాష్ట్రంలోని ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మండలంలోని మొకన్ పల్లిలో శక్తి కేంద్రలో సభనిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి బట్ట బయలు చేసేందుకే ప్రజా గోస బీజేపీ భరోసా అని అన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను గాలికి వదిలేసి యువకులను మద్యానికి బానిసలు చేస్తున్నాడని, రైతు కుటుంబాలను రోడ్డుకు తెస్తున్నారని అన్నారు. ఉచిత కరెంట్ అని చెప్పి రైతాంగాన్ని ఆగం చేసిన ముఖ్యమంత్రికి త్వరలోనే బుద్ధి చెప్తామన్నారు. బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లని విస్మరించారన్నారని, కేజీ టు పీజీ ఉచిత విద్యమాయమైందన్నారు. ఇదే కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ శాసనసభ్యులు షకీల్ నియోజకవర్గాన్ని ప్రజలని మోసం చేస్తున్నారని విమర్శించారు.

నియోజకవర్గ ప్రజలకు అతను చేసింది ఏమీ లేదని, కేసీఆర్ అవినీతితో పాలననడుస్తుంది అన్నారు. కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేసేందుకే ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ప్రజలు పెద్దఎత్తున రావడం భారతీయ జనతా పార్టీకి శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇంచార్జి భూషణ్ సర్పంచులు సుధాకర్, కూరెళ్ళ శ్రీధర్, సరీన్, అడ్లూరి శ్రీనివాస్, నర్సింహ రెడ్డి, ఆనంద్, మువ్వ నాగేశ్వరరావు, రచ్చ సుదర్శన్, సుక్కరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed