డిగ్రీ విద్యార్థి హత్య

by Sridhar Babu |
డిగ్రీ విద్యార్థి హత్య
X

దిశ, బోధన్ : బోధన్ వసతి గృహంలో ఆదివారం రాత్రి ఇంటర్ విద్యార్థులు చేసిన దాడిలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారి తండా కు చెందిన వెంకట్ (23) బోధన్ లోని బీసీ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ చదువుకుంటున్నాడు. అదే వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులతో వెంకట్ కు గొడవ

జరుగగా ఆదివారం రాత్రి సోమవారం నాడు జరిగే ఇంటర్ పరీక్షలో మాస్ కాపీయింగ్ కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులు చీటీలు తయారుచేసుకునే క్రమంలో వెంకట్ కు వారికి గొడవ జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆరుగురు విద్యార్థులు వెంకట్ పై దాడి చేయగా వెంకట్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న బోధన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

గ్రామస్తుల ఆందోళన, నిరసనలు...

ఇంటర్మీడియట్ విద్యార్థుల దాడిలో డిగ్రీ విద్యార్థి వెంకట్ మృతి విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు తిప్పారి తండాకు చెందిన గ్రామస్తులు బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. వసతి గృహంలో జరిగిన ఘటనలో బీసీ వసతి గృహం వాచ్ మెన్ ను సస్పెండ్ చేసి, వార్డెన్ పై శాఖ పరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు.

వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి : విద్యార్థి సంఘాలు

ఇంటర్మీడియట్ విద్యార్థుల దాడిలో మృతి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, వసతి గృహంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వార్డెన్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ. నాయకులు తలారి సంజయ్ డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతుని కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేని యెడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పలు విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed