నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

by Sridhar Babu |   ( Updated:2023-07-28 15:21:55.0  )
నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
X

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా మండలంలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గురువారం పూర్తి జలకలను సంతరించుకుంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 45 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండడంతో

45 వేల క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ శివ ప్రసాద్ పేర్కొన్నారు. నిజాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1404.66 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను 17.311 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరదనీరు మాంజీరాలోకి విడుదల చేస్తుండడంతో మాంజీరా పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహంలోకి దిగరాదని ఆయన సూచించారు.

Advertisement

Next Story