కోరుట్ల ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు

by samatah |
కోరుట్ల ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు
X

దిశ, మెట్‌పల్లి : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో 35 లక్షల మంది విద్యార్థుల జీవితాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని యువజన కాంగ్రెస్ మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మెట్ పల్లిలోని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇల్లు ముట్టడించారు. ప్రస్తుతం తెలంగాణలో పేపర్ లీకేజీ హావ నడుస్తున్న కారణంగా యువజన కాంగ్రెస్ పిలుపుతో రాష్ట్రం లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల ఇల్లు ముట్టడిలో బాగంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ ఇల్లు కాంగ్రెస్ నాయకులతో కలిసి ముంటడించామని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story