- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sanitation:మురికి కూపాలుగా మారుతున్న కాలనీలు..చోద్యం చూస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు
దిశ,పిట్లం: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యల పట్ల ఎన్నో నిధులు కేటాయిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందు నుండే మురికి కాల్వలను నిర్వహణ కానీ కాలనీలో దోమలకు ప్రబలకుండా నివారణ చేపట్టాల్సిన ఆదేశాలు ఉన్నప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దోమల నివారణ కొరకు పిట్లం మండలంలో ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేసి ఇప్పటివరకు వినియోగించిన దాఖలాలు లేవని ఆరోపణలు సైతం పిట్లం మండలంలో ఉన్నాయి. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఫాగింగ్ మిషన్ వినియోగించకపోవడం వల్ల మండలంలోని కాలనీలలో పేరుకుపోయిన చెత్త, చెదారం వల్ల దోమలు అనేకంగా ప్రబలుతున్నాయని అధికారులకు విన్నవించినప్పటికీ చర్యలు చేపట్టడంలో దాటవేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల ఇండ్లలోకి విష పురుగులు ప్రవేశిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కాలనీల్లో వీధి దీపాలు సైతం సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల కాలనీలన్నీ చీకటి మయంగా మారుతున్నాయని దీనివల్ల రాత్రి సమయంలో ఇండ్లలోకి వెళ్లాలంటే ఎలాంటి ప్రమాదం చూడాల్సి వస్తుందో అని కాలనీవాసులు భయాందోళన గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడితే కనీసం రోగాల బారిన పడకుండా ప్రజలు ఉంటారని మండలంలోని పలు కాలనీవాసులు వేడుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని పలువురు వేడుకుంటున్నారు.