'చలో గజ్వేల్' యాత్ర భగ్నం.. బీజేపీ నేత అరెస్ట్

by Vinod kumar |   ( Updated:2023-08-31 17:17:10.0  )
చలో గజ్వేల్ యాత్ర భగ్నం.. బీజేపీ నేత అరెస్ట్
X

దిశ, కామారెడ్డి: బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి నిర్వహించ తలపెట్టిన చలో గజ్వేల్ కార్యక్రమాన్ని 12 గంటల ముందే పోలీసులు భగ్నం చేశారు. రేపటి కార్యక్రమానికి సన్నద్ధం అవుతుండగా పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు రమణారెడ్డి ఇంటిని మఫ్టీలో పోలీసులు చుట్టుముట్టారు. సుమారు రెండు గంటల పాటు చుట్టూ పహారా కాసిన పోలీసులు రమణారెడ్డి ఇంటికి చేరుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి గాంధారి నుంచి బాన్సువాడ వైపు రమణారెడ్డిని తీసుకెళ్తున్నట్టుగా సమాచారం.

జిల్లా బార్డర్ జుక్కల్ పోలీస్ స్టేషన్ తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అరెస్టుకు ముందు వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్ వెళ్తే తప్పా అని ప్రశ్నించారు. తాము ఎలాంటి ఆందోళనలు చేపట్టడం లేదన్నారు. పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన గజ్వేల్ యాత్ర ఆగదన్నారు. ఇవాళ కాకపోయినా రేపయినా గజ్వేల్ వెళ్లి తీరుతామన్నారు. అక్రమ అరెస్టులు చేస్తే గజ్వేల్‌లో అభివృద్ధి లేదని ఒప్పుకున్నట్టేనన్నారు.

Advertisement

Next Story