వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ.. కేడి మహిళ నిర్వాకం

by Nagam Mallesh |   ( Updated:2024-08-12 11:52:21.0  )
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ.. కేడి మహిళ నిర్వాకం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ః ఓ కేడీ మహిళ దారుణానికి పాల్పడింది. ముసలావిడ అని కూడా చూడకుండా మెడలో గొలుసు లాక్కెళ్లింది. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. పట్టణంలోని విద్యుత్ నగర్ వృద్ధురాలు సరోజ ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన ఓ గుర్తుతెలియని.. ఆమె వద్దకు వచ్చి మాటా మాటా కలిపింది. వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆమె మెడలోని తులం బంగారు గొలుసును దోచుకెళ్ళింది. బాధితురాలు తేరుకొని జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story