నేనే వచ్చి మోడీ ఫ్లెక్సీ కడుతా.. కామారెడ్డి కలెక్టర్ పై కేంద్ర మంత్రి సీరియస్

by samatah |
నేనే వచ్చి మోడీ ఫ్లెక్సీ కడుతా.. కామారెడ్డి కలెక్టర్ పై కేంద్ర మంత్రి సీరియస్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ షాప్‌ను శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తనిఖీ చేశారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే వాట గురించి తనకి తెలియదని కలెక్టర్ సమాధానమిచ్చారు. దీంతో మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి మీకు ఎలా తెలియదు అని అంటారని నిర్మలా సీతారామన్ నిలదీశారు. అరగంట టైమ్ ఇస్తాను తెలుసుకొని చేప్పమని చెప్పిన మంత్రి, గతంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం వాటాలో 30 రూపాయలు ఇస్తే,రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు మాత్రమే ఇస్తుంది అన్నారు.

రూపాయి పేదోడి నుంచి తీసుకొని బియ్యం ఇస్తున్నారు. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు చెప్పాలి అన్నారు. మోడీ ఫ్లెక్సీ రేషన్ షాపు దగ్గర ఈ రోజు సాయంత్రం వరకు పెట్టకపోతే , నేనే వచ్చి ఫ్లెక్సీ కడుతాననీ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కలెక్టర్ కు వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story