- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ లో సెల్ ఫోన్ మిస్సింగ్.. దుబాయ్ లో ప్రత్యక్షం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ పోలిస్ శాఖ కొత్తగా తెచ్చిన టెక్నాలజీతో బాధితులు పోగొట్టుకున్న సెల్ పోన్ లు పోలీస్ లు ఈజీగా గుర్తించి అప్పగిస్తున్నారు. సీఈఐఆర్ టెక్నాలజీతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మిస్ ఐన సెల్ పోన్ ను దుబాయిలో గుర్తించి దానిని వెనక్కి రప్పించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంకు చెందిన షేక్ అహ్మద్ చికిత్స నిమిత్తం 45 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళాడు.
అనంతరం అస్పత్రిలో చికిత్స చేయించుకుని పరిశీలించుకోగా సెల్ పోన్ పోయినట్లు గుర్తించాడు. బాన్సువాడకు వచ్చి ఫిర్యాదు చేసినట్టు బాన్సువాడ డీఎస్పీ జగనాథ్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసుదర్యాప్తు చేపట్టగా నూతన టెక్నాలజీ సీఈఐఆర్ ద్వారా దుబాయిలో ఉందని గుర్తించి ఆ ఫోన్ ను కొరియర్ ద్వారా తెప్పించి బాధితునికి అప్పజెప్పినట్టు ఆయన తెలిపారు. అలాగే 11 సెల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అప్పజెప్పినట్లు డీఎస్పీ జగనాథ్ రెడ్డి తెలిపారు. బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.