మార్పు కోసం ప్రజలు.. అధికారం కోసం సర్పంచ్ అభ్యర్థులు

by Sumithra |
మార్పు కోసం ప్రజలు.. అధికారం కోసం సర్పంచ్ అభ్యర్థులు
X

దిశ, తాడ్వాయి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఎన్నికల సందడి షురూ కాబోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. ఈ మేరకు డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుండడంతో తాడ్వాయి మండలంలోని 18 గ్రామాలల్లో ఈసారి రసవత్తరంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పటి నుంచి గ్రౌండ్ స్థాయిలో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి. సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ఎన్నికల్లో గెలుపొందెందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదంటూ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక్కొక్క గ్రామంలో ముగ్గురు ఆపైన అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మేజర్ గ్రామపంచాయతీలలో ఏ కుల సంఘాల ఓట్లు ఎక్కువ ఉంటే వారి కుల పెద్దలను మెప్పించే పనిలో అభ్యర్థులు వారి స్థాయికి మించి ప్రయత్నాలతో నిమగ్నం అవుతున్నారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తేదీలు ఖరారు చేసే వరకు గ్రామాలల్లో ఓటర్లను మెప్పించే పనిలో ముక్క చుక్క తాగిపించడంలో నిమగ్నం అవుతున్నారనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. దీంతో ఇప్పటి నుంచే గ్రామాలల్లో జోరుగా ఏ సంఘం మద్దతు కూడగట్టుకుంటే సర్పంచ్ గా గెలుపొందగలము అనే చర్చలు ఇప్పటికే గ్రామాలల్లో ఉపందుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా పల్లెటూరులో డబ్బుల రాజకీయానికి పట్టం కడతారా లేదా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకు పట్టం కడతారో ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed