Jani Master : జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. పరామర్శించిన జనసేన నేత (ట్వీట్)

by Anjali |   ( Updated:2024-10-14 07:51:19.0  )
Jani Master : జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. పరామర్శించిన జనసేన నేత (ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ తెలుగు ఇండస్ట్రీలో అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఓ మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ ను పోలీసులు విచారించి నిజంగానే మహిళపై లైంగిక ఆరోపణలకు పాల్పడ్డాడని తేలాక.. జైల్లో ఉంచారు. ఈ సంఘటనపై జానీ మాస్టర్ స్పందించి.. యువతి చేస్తోన్న ఆరోపణలు అవాస్తవాలు అని కొట్టిపారేశాడు. తను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ను బలవంతం చేసిందని.. పెళ్లికి నిరాకరించాననే కోపంతో ఈ రకంగా కుట్ర పన్నిందని జానీ మాస్టర్ వెల్లడించారు. ఇకపోతే తాజాగా జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆమె నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

అయితే నెల్లూరుకు చెందిన జనసేన నాయకుడు కిశోర్ గుణుకుల తాజాగా జానీ మాస్టర్ తల్లిని ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాలో మాట్లాడారు. ‘‘జానీ బాయ్ తల్లి తీవ్ర మనోవేదనతో గుండె నొప్పితో బాధపడుతుంది. కోర్టు న్యాయ మూర్తులు త్వరితగతిన బెయిల్ ఇచ్చి, విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలి. పార్టీలకతీతంగా నాకు తెలిసినంతవరకు జానీ భాయ్ మంచి వ్యక్తి. ఆడవారితో కానీ ఇబ్బందుల్లో ఉన్న వారికి సేవ చేయడంలో కానీ సాటివారిని నొప్పించకుండా వారు ప్రవర్తించే తీరు మా అందరికీ గుర్తుంది. నాకు తెలిసినంతవరకు సాటివారితో చాలా మర్యాదగా ప్రవర్తించేవారు జానీ బాయ్.

ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని ఎంతోమంది వచ్చారు. అలాగే జానీ బాయ్ కుటుంబ సభ్యులైన వారి భార్య సుమలత.. తల్లి బీబీజాన్, కూతురు, అక్క కూడా ఆడవారే. వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. పెద్దలందరూ బయటకు వచ్చి జానీకి న్యాయం చేయాలి. సాధారణ స్థితి నుంచి ఎంతో కష్టపడి దేశీయ స్థాయిలో గుర్తింపు పొందిన జానీ బాయ్ కి అవార్డు తిరిగి దక్కాలని కోరుకుంటున్నాము. గత రెండు సంవత్సరాలుగా జానీ మాస్టర్ గురించి సోషల్ మీడియాలో మంచిగా పోస్ట్ పెట్టిన ప్రతి ఒక్కరినీ చెడుగా ప్రచారం చేసిన ఆ అమ్మాయితో ఉన్న సంబంధం ఏమిటి? అనేది చుట్టుపక్కల వారు ధైర్యంగా వివరించాలి’’. అంటూ జనసేన నేత మీడియా ముందు మాట్లాడారు.

Next Story

Most Viewed