Kurnool: మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై కొండచిలువ నాట్యం

by srinivas |   ( Updated:2024-10-14 07:52:21.0  )
Kurnool: మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై కొండచిలువ నాట్యం
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం మత్తులో కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. రోడ్లపై అరుస్తూ తిరుగుంటారు. మరికొందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు ఆకాశంలో చూస్తూ దేవుడితో మాట్లాడుతున్నా అని చెబుతారు. మరికొన్ని సమయాల్లో రోడ్డుపై ఉన్న జంతువులతో మాట్లాడతారు. కొన్ని సమయాల్లో డేంజర్ జోన్‌లోకి వెళ్లి వస్తుంటారు. ఇంకొన్ని సార్లు అతి చేసి జనాల చేతుల్లో తన్నులు కూడా తింటారు. మద్యం మరీ ఎక్కువైతే సోయలేకుండా అక్కడే పడిపోతుంటారు. ఆ సమయంలో ఎవరైనా కొట్టినా.. తిట్టినా... చీమలు కుట్టినా.. విష పురుగులు కరిచినా.. పక్కకు లాగిపడిసినా ఏమీ తెలియదు. తీరా మద్యం దిగిపోయిన తర్వాత అడిగితే తనకు అసలు ఏం గుర్తు లేదని చెబుతుంటారు. ఇలాంటి ఘటనలకు భిన్నంగా కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురించేసింది, నవ్వించింది.


కర్నూలు జిల్లా అవుకు మండలం సింగనపల్లికి చెందిన లారీ డ్రైవర్ డ్యూటీ దిగి ఫుల్లుగా మద్యం సేవించారు. మద్యం బాగా ఎక్కడంతో ఇంటికి వెళ్లలేకపోయారు. ఈ క్రమంలో ఓ చోట అరుగుపై కూర్చుకున్నారు. మద్యం మత్తులో తూగుతూ ఉండిపోయారు. అయితే పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఓ కొండ చిలువ.. సదరు వ్యక్తి వద్దకు వచ్చింది. అయినా ఆయనకు ఏమీ తెలియలేదు. కొంత సమయంలో తర్వాత ఆ వ్యక్తిపైకి పాకుతూ ఎక్కిగింది. బసలు కొడుతూ అటూ, ఇటూ తిరిగింది. అయినా మద్యంబాబుకు ఏమీ తెలియలేదు. కొంతసేపటికి కొండచిలువతో ఉన్న లారీ డ్రైవర్‌ను చూసిన స్థానికులు.. కట్టెల సహాయంతో పక్కకు లాగేశారు. ఒంటిపై కొండచిలువ నాట్యం చేస్తున్నా లారీ డ్రైవర్‌కు స్పర్శ తెలియకపోవడంతో ఇలా ఉన్నాడేంటి అంటూ గ్రామస్తులు నవ్వుకున్నారు. అయితే అంతసేపు ఒంటిపై తిరిగిన కొండచిలువ.. లారీ డ్రైవర్‌ను ఏమీ చేయకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed