Lavender perfume: నీలి పూల సుగంధం.. లావెండర్ పెర్ఫ్యూమ్‌తో ఆ సమస్యలు మాయం!

by Javid Pasha |
Lavender perfume: నీలి పూల సుగంధం.. లావెండర్ పెర్ఫ్యూమ్‌తో  ఆ సమస్యలు మాయం!
X

దిశ, ఫీచర్స్ : అవి చూడ్డానికి అందమైన నీలి రంగు పూలు మాత్రమే కాదు, సుగంధాలు వెదజల్లే పెర్ఫ్యూమ్‌ల తయారీలోనూ కీలకంగా ఉంటున్నాయి. పైగా ఈ లావెండర్ పూల సువాసనలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. కాశ్మీర్‌ కొండల్లో ఎక్కువగా కనిపించే ఈ పూలను వ్యాపారులు సేకరించి కన్నౌజ్‌లోని పెర్ఫ్యూమ్ తయారీదారులకు విక్రయిస్తారు. అక్కడ తయారయ్యే పెర్ఫ్యూమ్‌లు ప్రస్తుతం చాలా మంది ఇష్టపడుతుంటారు. వీటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

లావెండర్‌ను ‘లవందుల’ అని కూడా పిలుస్తారు. ఈ ఊదా రంగు పుష్పాలను సువాసన గల నూనెల తయారీకి ఉపయోగిస్తారు. వీటిలో ఉండే ఔషధ గుణాల మూలంగా అవి దుర్వాసనలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అలాగే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. లావెండర్ ఆయిల్ లేదా పెర్ఫ్యూమ్‌లలో ఉండే సువాసనలు మానసిక స్థితి మెరుగు పరుస్తాయని, తలనొప్పి, జుట్టు రాలడం, చర్మ సమస్యలు వంటివి తగ్గిపోతాయని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. అరోమాథెరపీలో కూడా లావెండర్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్‌లలో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారని నిపుణులు చెప్తున్నారు.

Next Story

Most Viewed