బలగం సినిమా సీన్ రిపీట్.. మటన్ బొక్క కోసం ఎంతకు తెగించారో తెలుసా?

by Anjali |
బలగం సినిమా సీన్ రిపీట్.. మటన్ బొక్క కోసం ఎంతకు తెగించారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మటన్ బొక్క కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్లే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్బాయికి.. నిజామాబాద్‌కు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కట్నకానుకలు మాట్లాడుకున్నారు. నవంబర్ 1వ వారంలో నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకలో అమ్మాయి ఇంట్లో మటన్‌తో భోజనం పెట్టారు. అబ్బాయి తరపున బంధువులు మూలుగ బొక్క కావాలని అడిగారు. దీంతో ఇరువర్గాల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ గొడవ చివరకు పోలీసుల వరకు వెళ్లగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అయినప్పటికీ పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. పెళ్లి సమయంలో ఒక్కోసారి ఇలాంటి చిన్న చిన్న గొడవల కారణంగానే వివాహాలు క్యాన్సిల్ అవుతున్నాయనడానికి ఇదే మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇటీవల పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ‘బలగం’ సినిమాలో కూడా మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి అనంతరం పండగకు అత్తారింటికి వెళ్లిన అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ, బామ్మర్దుల మధ్య గొడవ వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed