- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లులకు పురుటి నొప్పులు...తండ్రులకు కాసుల కష్టాలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ లో ఆగస్టు నెలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 81 మంది మహిళలు ప్రసవం కోసం చేరితే తొమ్మిది మందికి మాత్రమే నార్మల్ డెలివరీలు కాగా 72 మందికి ల్యాప్రోస్కోపి సర్జరీ నిర్వహించారు. పేరుకు ప్రైవేట్ ఆసుపత్రిగా చెబుతున్నా అందులో చేరితే కనీసం 35 వేల నుంచి మొదలుకుని అత్యధికంగా లక్ష వరకు ఫీజులు గుంజినట్లు సమాచారం. నగరంలోని ఓ థియేటర్ ప్రక్కన ఉన్న మరో నర్సింగ్ హోంలో 61 మంది ప్రసూతి కోసం చేరితే అందులో ఇద్దరు మాత్రమే సాధారణ కాన్పు జరుగగా 59 మందికి సర్జరీ చేసి కాన్పు చేశారు.
నగరంలోని హైదరాబాద్ రోడ్డులో మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో 52 మంది ప్రసవం కోసం చేరితే 10 మంది నార్మల్ డెలివరి కాగా 42 మంది ఎల్ ఎస్ సీఎస్ చేశారు. నగరంలోని పేరు మోసిన మహిళా వైద్య నిపుణురాలిగా ఆసుపత్రి తెరిచి ప్రతి శుక్రవారం మహిళలకు ఉచిత వైద్య సేవలందించే ప్రైవేట్ నర్సింగ్ హోంలో 64 మంది చేరితే ముగ్గురికి సాధారణ కాన్పు జరుగగా మిగిలిన 61 మందికి సిజేరియన్ నిర్వహించారు. 95 శాతం మందికి సిజేరియన్లు నిర్వహించిన గొప్ప చరిత్ర మూటగట్టుకున్నారు.
మాతృత్వం వరం.. తల్లి కావడం ప్రతి స్ర్తీ కల.. దాని కోసం తొమ్మది నెలలు అష్ట కష్టాలు పడుతుంటారు మహిళలు. నవమాసాలు మోసిన తల్లికి ప్రసవ వేదన వర్ణాతీతం. ఒకప్పుడు మంత్రసానులు కాన్సులు చేసేవారు లేదా ఇంటిలోని పెద్ధవారు ప్రసవాలను చేసేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. అమ్మమ్మ ఇళ్లు అనేది కాన్పులకు కేరాప్ ఉండగా ఇప్పుడు ఆసుపత్రులలో కాన్సులకు అందరు మొగ్గు చూపుతున్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే అపోహలు ఇప్పటికి ప్రభుత్వ దవాఖానాల పై పోలేదు.
దానితో ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులకు మహిళలు భయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి వైద్య నిపుణులు ఉన్న 24 గంటల సేవలు అందుబాటులో ఉన్న అందులో ప్రసవ సేవలను పొందడానికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం ఆసుపత్రులలో ప్రసవం చేయించుకుంటే ఉచిత వైద్య సేవలతో పాటు కేసీఆర్ కిట్ లాంటి పథకాన్ని పెట్టినా అందులో చేరడం లేదు. దానితో ప్రైవేట్ లో ప్రసవాల కోసం వెళ్తే కడుపు కోతలు తప్పడం లేదు. అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్ల మీద సిజేరియన్లు చేస్తున్నారు. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తే రూ.30 వేలు మొదలుకుని రూ.లక్షన్నర వరకు గుంజుతున్నారు.
పేరుకే సిజేరియన్ అని చెబుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 9 నెలల కన్సల్టెషన్ ఒకేత్తయితే ఆపరేషన్ దానికి పది రేట్లు ఎక్కువ. దాంతో ప్రైవేట్ లో పురుడు పోసుకోవడం అంటే పుట్టలకొద్ది కాసులు చెల్లించాల్సిందే. జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో రిజిస్ట్రేషన్ అయిన నర్సింగ్ హోం లు 75 ఉండగా అందులో కాసులకు పురుడు పోస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మూడు డివిజన్ ల పరిధిలో 75 ప్రైవేట్ నర్సింగ్ హోంలు ఉండగా ఒక్క నిజామాబాద్ నగరంలోనే 46 నర్సింగ్ హోంలు ఉన్నాయి. గత ఆగస్టు మాసంలో 962 మంది గర్భిణిలు ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితో 103 మందికి మాత్రమే సాధారణ ప్రసవం జరిగింది. మిగిలిన 859 మందికి సిజేరియన్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రసూతి ఆపరేషన్లు 89 శాతం కావడం గమనార్హం. గత జులై మాసంలో 91 శాతం మంది మహిళలకు సిజేరియన్లు నిర్వహించిన అపఖ్యాతిని మూటగట్టుకుంది.
జిల్లా కలెక్టర్ , వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో సిజేరియన్లను తగ్గించేందుకు తనిఖీలను చేపట్టిన ప్రైవేట్ వైద్యుల తీరులో మార్పు రాలేదు. కేవలం 2 శాతం మాత్రమే సిజేరియన్లు తగ్గడం విశేషం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ల పేరిట దోపిడిని అడ్డుకట్ట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆదిలోనే విఫలం కావడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో సకల సౌకర్యాలున్నా కేవలం దానిపై ఉన్న అపనమ్మకాలతో ప్రైవేట్ లో వైద్యం కోసం వెళ్తే అక్కడ నిలువు దోపిడికి గురవుతున్నారు. ప్రసవ వేదన తల్లికి కన్నీళ్ళు తెప్పిస్తుంటే తండ్రికి కాసుల కష్టాలను తెప్పిస్తున్నాయి.
ప్రైవేట్ గైనకాలజిస్టుల వద్ద సేవలకు గర్భదారణ ప్రారంభం నుంచి సేవలు పొందిన సేవలు పొందిన సిజేరియన్లకు మాత్రం అదనంగా బాదేస్తున్నారు. 9 నెలల కాలంలో ప్రతి నెల స్కానింగ్, మందుల పేరిట ఒక్కొక్క గర్భిణీ నుంచి రూ.2500 నుంచి రూ.5 వేల వరకు పిండేస్తున్నారు. పోని తమ ఆసుపత్రుల్లోనే మొదటి నుంచి చికిత్స తీసుకుంటున్న వారని కనికరం చూడకుండా కాసుల కోసం అవసరం లేకున్నా వారిని లేనిపోని భయాలను రేపి సిజేరియన్లను నిర్వహిస్తున్నారు.
దాంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవానికి అయ్యే ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. ఆసుపత్రుల్లో సిజేరియన్ (సెక్షన్) అంటేనే మెడికల్ నిర్వాహకులతో పాటు ఆసుపత్రి వైద్యులకు వరంగా మారింది. సర్జరీకి అయ్యే మందుల ఖర్చుతో పాటు డిశ్చార్జి మందుల బిల్లులు రూ.20 వేలకు తక్కువగా కావడం లేదంటే ఆషామాషి కాదు. మొత్తానికి ప్రైవేట్ ఆసుపత్రిలలో వైద్య సేవలు తల్లిదండ్రులు ఇద్దరికి ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.