- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ను తరిమేయాలి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొడుదాం, ఢిల్లీ గద్దెపై కాంగ్రెస్ జెండాను ఎగరవేద్దామని జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నిజామబాద్ జిల్లా బోధనలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కారు తెలంగాణలో ఫంక్చర్ అయిందని, దానికి బీజేపీ గాలి నింపే ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులలో లక్ష కోట్ల కుంభకోణం చేశారని, దొరల తెలంగాణలో ఇది పెద్ద కుంభకోణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం అన్ని హక్కుల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చి రైతులకు అన్యాయం చేసిందన్నారు. కేసీఆర్ ధరణి పోర్టల్ ద్వారా ప్రజల భూమిని లాక్కొందని, కేసీఆర్ చదువుకున్న పాఠశాల కాంగ్రెస్ పార్టీ స్థాపించినవే అన్నారు.
హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీ చేసింది, ఔటర్ రింగ్ రోడ్డు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. కేసీఆర్ మీరు పరిపాలించే రాష్ట్రాన్ని ఇచ్చిందని, తాము దళిత బంధు స్కీమ్ లో ఎమ్మెల్యే లు మూడు లక్షలు కమీషన్ తీసుకొని మోసం చేస్తున్నారన్నారు. దొరల ప్రభుత్వం తరిమికొట్టి తెలంగాణ లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఆరు గ్యారంటీ స్కీమ్ లలో మహిళ లకు లబ్ధి చేకూరుతుందని, గృహిణి లకు గ్యాస్ సిలిండర్ ల ద్వారా 500 ఇచ్చి లబ్ధి చేస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం రైతు భరోసా ద్వారా 15 వేలు ఎకరాకు ఇస్తామని, గృహ అవసరాలకు 200 యూనిట్స్ కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు. ఇల్లు లేని వారికి స్థలం ఇచ్చి
ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం చేస్తామన్నారు. ప్రతి మండలానికి ఒక ఇంటర్ నేషనల్ స్కూల్, ఆరు గ్యారంటీ స్కీమ్స్ కు మొదటి సంతకం చేస్తామన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బిటీం అని, తన మీదే బీజేపీ 24 కేసులు పెట్టారన్నారు. లోకసభ నుండి రద్దు చేస్తే ప్రభుత్వ ఇంటిని వారికే ఇచ్చేశానన్నారు. నా ప్రజల కోట్ల ఇళ్లు ఉన్నాయని, తెలంగాణ ప్రజల ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెలో తామున్నామన్నారు. తెలంగాణ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం ను తరిమికొట్టి, ఢిల్లిలో కాంగ్రెస్ ఏర్పాటు చేద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజా తెలంగాణ వస్తుందన్నారు.