కామారెడ్డిలో KCR ఓటమికి కారణం ఆ BRS లీడరే..?

by Satheesh |   ( Updated:2023-12-05 04:22:57.0  )
కామారెడ్డిలో KCR ఓటమికి కారణం ఆ BRS లీడరే..?
X

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసిందెవరనే విషయాన్ని చెప్పకనే చెబుతున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

హల్చల్ చేస్తోన్న పోస్ట్ యథావిధిగా

కామారెడ్డి విషయంలో మాత్రం ఇన్​చార్జిగా వ్యవహరించి ప్రధాన పదవిలో ఉన్న నేతకు ఇక్కడ కేసీఆర్ పోటీ చేయడం ఇష్టం లేదు. పైకి మాత్రం నేనే కేసీఆర్‌ను కామారెడ్డి కి ఆహ్వానించా అంటూ బింకాలు.. లోపల మాత్రం కామారెడ్డికి నేనే బాస్‌గా ఉండాలని కోరిక. కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి, కామారెడ్డికి బాస్‌గా ఉండాలనే స్వార్థం. పదవి కాంక్షతో వార్డు మెంబర్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిల్లర్లు, ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి నలుగురు, ఐదుగురు ప్రధాన నాయకుల మధ్య కూడా గ్రూప్‌లను, వర్గాలను ప్రోత్సహించి పార్టీని సర్వ నాశనం చేసిండు. ఈ ప్రధాన నేతకు తోడుగా జిల్లా స్థాయిలో పార్టీపై ప్రధాన బాధ్యతలు,అధికారం కలిగిన మరో నాయకుడు ఉన్నారు.

పార్టీ ఇమేజ్ డామేజ్ అవుతుంటే అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కలిగిన నాయకుడు ఆ డామేజ్‌లో సగ భాగస్తుడుగా మారి పార్టీపై అన్ని బాధ్యతలు, రైట్స్ ఉండి పార్టీ డామేజ్ కంట్రోల్ చేయకుండా ఈ వర్గాల కుమ్ములాటలో గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తూ అన్ని పదవులు అనుభవిస్తూ నేనే కామారెడ్డికి బాస్ కావాలని అధిష్టానానికి, ఇక్కడ ప్రధాన నేతలకు గోడమీద పిల్లిలా వ్యవహరించిన బాధ్యత కలిగిన నేత వ్యవహార శైలి పార్టీ ఇమేజ్ డామేజ్ చేసిన తీరు కూడా ఈరోజు కామారెడ్డిలో పార్టీ నాశనానికి దారి తీసింది. గత ఐదేండ్ల నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని నడిపిన దందాలు వ్యవహారాలు, నేడు కేసీఆర్​ పోటీ చేస్తున్నారని తెలిసిన నాటి నుంచి వారు నడిపిన వ్యవహారాలు అన్నీ గులాబీ బాస్ అపజయానికి కారణం అయ్యాయి.

అపజయం ఎరుగని మహా నేత కేసీఆర్​మన కామారెడ్డిని నమ్మి వస్తే పదేండ్లు అధికారం పదవులు అనుభవించిన నేతలే కేసీఆర్​ ఓటమికి ప్రధాన సూత్రదారులు. ఉదయం 9 గంటలకు కేసీఆర్‌కు మద్దతుగా ప్రచారంలో ఉండాల్సినోడు 11 గంటలకు కూడా లుంగీ కట్టుకుని ఇంట్లో ఉంటే కేసీఆర్‌ను ఎట్ల గెలిపిస్తారు అనుకుంటున్నారు.. ఎంత సేపు పైసల్ గురించి మాట్లాడతారు తప్ప అసలు తప్పులు ఎక్కడ జరిగినయో ఆలోచించరా.. రమణారెడ్డి ఓటర్లకు రూపాయి పంచలేదు. కానీ మనోళ్లు మాత్రం ఇంకా 100కు 50 ఇచ్చిర్రు, 20 ఇచ్చిర్రు అని కొట్లాడుతుండ్రు..

పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను గుర్తించే నాయకుడు ఉండాలి. రోజూ పొద్దున లేచి ఇంటికొచ్చి జోకే నాయకులనే మెట్లు ఎక్కనిస్తే జోకేటోడు ఓట్లు తీసుకురాడు. గ్రౌండ్‌లో తిరుగుతూ ఏ పదవి, ఒక్క పైసాకూడా పార్టీ నుంచి ఆశించకుండా పార్టీ కోసం స్వంత డబ్బు ఖర్చు చేసే కార్యకర్తలు, నాయకులు చాలా మంది ఉన్నారు.. అలాంటి వాళ్లను పార్టీ గుర్తించాలి. జోకించికునే వాళ్లను, జోకుడుగాళ్లను, గ్రూప్‌లు వర్గాలను ప్రోత్సాహంచే వాళ్లను పార్టీ నుంచి పదవుల నుంచి తొలగించి, కార్యకర్తలకు అందుబాటులో ఉండే మంచి నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించాలి.

ఉదయం 11, 12 గంటల వరకు ఇంట్లో నుంచి బయటకెళ్లకుండా, ఒంటికి రంగులు పూకుసుని కార్యకర్తలను, నాయకులనే కాకుండా, మినిస్టర్, స్పీకర్ స్థాయి వ్యక్తులను కూడా గంటల గంటలు పార్టీ కార్యక్రమాల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం గంటల తరబడి ఎండలో ఎదురుచూపించే నాయకులతోనే ప్రక్షాళన ప్రారంభించాలి.. పెద్ద సారు పోటీ చేస్తున్నాడు అని తెలిసి అందరికంటే అడ్వాన్సుగా నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాల్సినోడు అనుకున్న సమయానికి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాల్సినోడు తానే పోటీ చేస్తున్న అనుకుని అడ్వాన్సుగా అప్రమత్తమై చకా చకా అన్ని పనులు పూర్తి చేసుకొని అనుకున్న సమయానికే ప్రచారం ప్రారంభించాలి.

అవినీతి పరులను, అక్రమ వెంచర్లను ప్రోత్సాహస్తూ, ఆ వెంచోర్లలో జీరో ఇన్వెస్ట్‌లతో పార్టనర్ షిప్‌లు తీసుకుని, అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్లాట్లు చూపించని ప్రైవేట్ వెంచర్‌‌లకు ప్రజా ధనం ఖర్చు చేసి రోడ్లు వేసే నాయకులు, పార్టీ ఇమేజ్ డామేజ్ చేసి జేబులు నింపుకునే నాయకులతో పార్టీ ప్రక్షాళన ప్రారంభించాలి.. కేసీఆర్​గెలుపు కోసం పార్టీ ని ముందుండి నడిపించాల్సిన వ్యక్తి, విజయం కోసం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత కలిగిన నాయకుల నిర్లక్ష్య ధోరణితో వ్యహరించిన నాయకుల‌తోని ప్రక్షాళన ప్రారంభించాలి.

Advertisement

Next Story