- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహరాష్ట్రలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ.. సీఎం కేసీఆర్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: మహరాష్ట్రలో త్వరలో జరగబోయే స్థానిక సంస్ధల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటు నాందేడ్ జిల్లాలో రెండు బీఆర్ఎస్ సభలను విజయవంతంగా పూర్తి చేసిన కేసీఆర్ అక్కడ రాబోయే ఎన్నికల్లో బరిలో నిలువడం ఖాయమని ప్రకటించారు. ఫిబ్రవరి 5న నాందేడ్ జిల్లా కేంద్రంలో, ఆదివారం కాందహార్ లోహలో జరిగిన బారి బహిరంగ సభకు వచ్చిన స్పందన నేపథ్యంలో సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన త్వరలో జరగబోయే మహరాష్ర్ట లోకల్ బాడీ ఎన్నికల ద్వారా తెలంగాణ ప్రాంతేతరంగా బీఆర్ఎస్ ఎన్నికల గోదాలో తన లక్కిని పరిక్షించుకోనుంది.
నాందేడ్ జిల్లా కేంద్రంలో జరిగిన సభకు లక్ష వరకు చిన్న పట్టణం ఐనా లోహలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అక్కడ ఎన్నికల ప్రకటన చేయడం మహరాష్ట్రలో బీజేపీ కాంగ్రెస్ , ఎన్సీపీ లతో పాటు కొత్త పార్టీగా బీఆర్ఎస్ బరిలో నిల్చోవడం ఖాయమైంది. టిఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారిన తరువాత దాని అధినేత కేసీఆర్ ప్రధానంగా మహారాష్ట్ర పై కన్నేశారు. జాతీయ పార్టీగా మనుగడకు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి సాధించాల్సిన ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం నాందేడ్ జిల్లా పై నజర్ వేసి అక్కడి నుంచి బిఆర్ఎస్ పార్టి విస్తరణను చేపట్టారు..
నైజాం పాలనలో తెలంగాణతో పాటు మరట్వాడాగా పేరుగాంచిన నాందేడ్ ప్రాంతంతో తెలంగాణ కు విడదీయరాని సంబంధం ఉంది. తెలంగాణ తో సుదీర్ఘ ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో నాందేడ్ జిల్లాకు సరిహద్దు ఉంది. నాందేడ్ జిల్లా తో నిర్మల్ జిల్లా సరిహద్దులు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు మహా ప్రజలకు వ్యాపార, బాంధవ్యాలు ఉన్నాయి. నాందేడ్ జిల్లాలకు చెందిన వారు వైద్యంతో పాటు ఉపాధి నిమిత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా మంది వలస వచ్చిన వారు ఉన్నారు. రైల్వే తో పాటు జాతీయ రహదారుల ద్వారా జరిగే వాణిజ్య సంబంధాలతో పాటు రాజకీయ నాయకులకు తెలంగాణ వారితో సుట్టరికం ఉంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను తమ ప్రాంతంలో అమలు కావడం లేదని అక్కడ ప్రజలు గ్రామల ప్రజా ప్రతినిధులు తమను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. నాందేడ్ తో పాటు పక్కన ఉన్న జిల్లాలకు చెందిన 90 గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు తమను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ తీర్మానం కాపీలను సీఎం కేసీఆర్ తో పాటు సరిహద్దు ప్రాంతాలకు చెందిన జిల్లా ఎమ్మెల్యే లకు అందచేశారు. మహారాష్ట్రలో బీజేపీ - శివసేన సర్కార్ ఉండటంతో పాటు అక్కడ పుట్టిన గోదావరి నది పరివాహక ప్రాంతం తెలంగాణ వరకు ఉండగా రైతుల నీటి కష్టాలతో పాటు రైతులకు మద్దతు ధర , బీమా పథకాల విషయం పై రైతులను బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కేసీఆర్ అభ్యర్థించారు.
బీఆర్ఎస్ పార్టి జాతీయ పార్టీగా అవతరించడానికి మొదటి ప్లాట్ ఫాం గా మహరాష్ర్ట ను ఎన్నుకోవడానికి ఇక్కడి నేతలు ఆ పార్టీలో చేరడం ప్రధాన కారణం. గడచిన నెలలో జరిగిన నాందేడ్, ఆదివారం జరిగిన లోహ సభ లో చాలామంది బీజేపీ కాంగ్రేస్, ఎన్ సిపి, బీఎస్‌పి పార్టీల నాయకులు బిఆర్ఎస్ లో చెరారు. అక్కడ పార్టీ విస్తరణ భాధ్యతలను నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆశన్నగారి జీవన్ రెడ్డి తో పాటు షకిల్, హన్మంత్ షిండే లకు నిర్మల్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ లకు అప్పగించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే లు, ఎంపీలు ఎవరు పార్టీలో చేరలేదు.
కానీ, మాజీలు చాలా మంది చేరారు. దానికి తోడు తెలంగాణలో విలీనం కోరిన చాలామంది గ్రామల ప్రజా ప్రతినిధులు స్వచ్చంధంగా చేరడంతో ప్రత్యక్ష ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టి అభ్యర్ధులను బరిలో నిలిచి బలపడాలని బిఆర్ఎస్ పార్టి యోచిస్తుంది. దీనిలో భాగంగానే సభలు సమావేశాలతో పాటు కోత్తగా చెరికలను ప్రోత్సహిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహరాష్ట్రలో లోక్ సభ, శాసన సభ ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలలో నిలువడం ద్వార గ్రౌండ్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ ఎన్నికలను వాడుకోవాలని చూస్తుందని చెప్పాలి. మహరాష్ట్రలో ఇప్పటికే పార్టీ ఇంచార్జీలను నియమించిన కేసీఆర్ ఎన్నికల కోసం సైతం వారికే భాధ్యతలను అప్పగిస్తారని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది.