టీఆర్ఎస్ తాటాకు చప్పుల్లకు భయపడేది లేదు : Palle Gangareddy

by samatah |   ( Updated:2022-08-23 12:31:04.0  )
టీఆర్ఎస్ తాటాకు చప్పుల్లకు భయపడేది లేదు : Palle Gangareddy
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్ఎస్ నాయకుల తాటాకు చప్పుల్లకు భయపడేది లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. మంగళవారం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు పల్లె గంగా రెడ్డి , అల్జపూర్ శ్రీనివాస్ , దన్ పాల్ సూర్య నారయణ, వడ్డి మోహన్ రెడ్డి, డా. మల్లిఖార్జున్ రెడ్డిలు మాట్లాడుతు.. టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే పోలీసులను పక్కకు పెట్టి వస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉందని, దీనిపై సీబీఐ విచారణ తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉన్నట్టు, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ దొంగలు పేర్లు బయటకు వచ్చిన శరత్, కిరణ్, పిలై ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యక్తులు కాదా, దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తూ కేసీఆర్ ఆదేశాలను పోలీస్ శాఖ తూచతప్పకుండా పాటిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారి పోయిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed