- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ 13న ఆర్మూర్ లో బీజేపీ కార్యవర్గ సమావేశం..
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు బీజేపీ పార్టీ వివిధ మోర్చాల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్ చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ నివాసంలో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెస్సు అనిల్ మాట్లాడుతూ బీజేపీ కార్యవర్గ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ జవదేకర్, పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ హాజరవుతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశానికి బీజేపీ, వివిధ మోర్చాల కార్యవర్గ కమిటీల నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ సాధించి పదిసంవత్సరాలు అవుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరున ఉత్సవాలు నిర్వహించడం వృధా ప్రయాస అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరున ఉద్యమం జరిగి సాధించుకున్న తెలంగాణలో యువత ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారన్నారు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పి దగా చేశారన్నారు. ఈ సమావేశంలో పట్టణ ఉపాధ్యక్షులు పాన్ శ్రీనివాస్, మీసాల రాజేశ్వర్, భవాని నవీన్, పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, చిక్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.