తెలంగాణ టీటీడీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు..

by Sumithra |
తెలంగాణ టీటీడీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు..
X

దిశ, బీర్కూర్ : బీర్కూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గల తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ జడ్పీటీసీ సభ్యులు ద్రోణావళి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ మన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మన ఎమ్మెల్యేగా ఉండడం మనకు ఎంతో గర్వకారణం అని అన్నారు.

ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం వలన మన బాన్సువాడ నియోజకవర్గం తెలంగాణలోని ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. మరో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేయడం ఖాయమని తెలిపారు. ఆలయంలో పూజల అనంతరం ప్రజాపతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ ను కట్ చేసి సెలబ్రేషన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాపతినిధులు, దిశ గంగన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story