- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవానిపేట బ్రిడ్జి మరమ్మతులు వెంటనే చేపట్టాలి
దిశ, మాచారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పాల్వంచ మండలంలోని భవానిపేట బ్రిడ్జికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న భవానిపేట బ్రిడ్జిని ఆయన గురువారం సందర్శించారు. బ్రిడ్జి అప్రోచ్ లు వరద తాకిడికి కొట్టుకుపోవడం వల్ల మూడు గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయని, ఇంజనీరింగ్ అధికారులు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కింద వచ్చే నిధులతో మరమ్మతులు జరిగే అవకాశం ఉందన్నారు. అనంతరం ఆయన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన కామటి నర్సయ్య, లచ్చపేట గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు కైరం కొండ శివ రాములు కుటుంబాలను పరామర్శించారు. ఈ ఈకార్యక్రమంలో మండల బీజేపీ కమిటీ అధ్యక్షుడు పోసు అనిల్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల వెంకట్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు తోట బాలరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మదనాల శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కట్ట భాస్కర్ రెడ్డి, నాతి ఉమాపతి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు రాగవాపురం శ్రీనివాస్, సామాగంజి నరేష్, యువమొర్చ అధ్యక్షులు చెరుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.