కల్తీ కల్లు పై అబ్కారి శాఖకు శ్రద్ధ ఏది ?

by Sumithra |
కల్తీ కల్లు పై అబ్కారి శాఖకు శ్రద్ధ ఏది ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బెల్ట్ షాపుల నిర్వహకులను బైండోవర్ల భయం పట్టుకుంది.. ఎప్పుడు ఏ ఏక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వస్తుందని వనికిపోతున్నారు. ఎక్కడ బెల్ట్ షాపు నిర్వహకులు లూజ్ మద్యం అమ్మకాలు అమ్ముతారో అని అబ్కారి శాఖాధికారులు తహశీల్ధార్ ముందు బైండోవర్ చేస్తారోనని భయపడిపోతున్నారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 520 గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్ షాపుల నిర్వహకులు బైండోవర్ ల భయం వెంటాడుతుంది. ఎమ్మార్వో వద్ద బైండోవర్ చేసిన తర్వాత మద్యం అమ్మకాలు లూజ్ గా విక్రయించినట్టు తెలితే రూ.2 లక్షల జరిమానాతో పాటు రిమాండ్ పంపడం ఖాయం కావడంతో వారు మద్యం అమ్మకాలు చేయాలా వద్ధ అన్న సంశయం వారిని వెంటాడుతుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనరేట్ పరిధిలోని 10 ఆబ్కారీ పోలీస్ స్టేషన్ లలో బైండోవర్ ల జాతర కోనసాగుతోంది.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 151 మద్యం దుకాణాలు.. 22 బార్లు ఉండగా అందులో సింహ భాగం మద్యం విక్రయాలు బెల్ట్ షాపుల్లోనే జరుగుతాయి. 2023 లొ మద్యం లైసెన్స్ ల టెండర్లను నిర్వహించి లక్కీ డ్రా లో దక్కించుకున్న వారికి 2024 జనవరి లో కొత్తగా మద్యం దుకాణాల లైసెన్స్ లను కేటాయించారు. కాని వాటిని లక్కీ డ్రా ద్వార దక్కించుకున్న వారు కోట్ల రూపాయాల గుడ్ విల్ కు అమ్ముకున్నారు. కాని అక్కడ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అబ్కారి అధికారులు. ఎందుకంటే నౌకరి నామా జారీలకు లక్షల రూపాయలు రావడంతో వారు ష్ గప్ చూప్ అయ్యారు. అయితే మద్యం క్రయ విక్రయాలకు మూలాధారం బెల్ట్ షాపులే. ప్రతి బెల్ట్ షాపు నిర్వహకుడు జనాభా ప్రాతిపదికన లైసెన్సుడ్ మద్యం దుకాణాల నుంచి లిక్కర్, బీర్లు కొనుగోలు చేసి ఆయా గ్రామాల్లో లేదా గల్లిలో అమ్మకాలు జరపాలి. అదే మద్యం దుకాణదారులు రాసుకున్న చట్టం. లేకపోతే మద్యం దుకాణదారులు ఫిర్యాదు చేస్తే చాలు బెల్ట్ షాపు నిర్వహకుల పై కుదిరితే పోలీసులు లేకపోతే ఆబ్కారీ శాఖ కేసులు నమోదు చేయడం పరిపాటిగా సాగుతుంది.

ప్రభుత్వానికి ఆదాయం పెంచడంలో మద్యం క్రయ విక్రయాలది మొదటి స్థానం. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా ఒకప్పుడు మద్యపాన నిషేధ, నియంత్రణ శాఖగా ఉన్న అబ్కారి శాఖ ఇప్పుడు ఎక్సైజ్ శాఖగానే పరిమితమైంది. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే మద్యం విక్రయాలను పెంచాలని టార్గెట్ పెట్టి అమ్మకాలు చేస్తున్నది. బెల్ట్ షాపుల నిర్వహకులు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలకు లక్షల రూపాయలు చెల్లించి మద్యం అమ్ముకోవాలి. అది చాలదన్నట్టు ఇటు పోలీసు శాఖకు, అటు ఆబ్కారీ శాఖకు నెలవారి చదివింపులు తప్పనిసరి. లిక్కర్ బాటిల్ పై రూ.20 నుంచి రూ.50 బీర్ బాటిల్ పై రూ.20 మిగులుతుందని భారీగా పెట్టుబడులు పెట్టిన వాటిని రాబట్టుకోవడంలో నానా కష్టాలు పడుతున్న బెల్ట్ షాపు నిర్వహకులు ఇప్పుడు బైండోవర్ కేసులు అంటే భయపడుతున్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా కల్తీ మత్తుకల్లు అమ్ముతుంటే దానితో ప్రభుత్వానికి సున్న ఆదాయం వస్తుంటే దాని పై చర్యలు తీసుకోవడంలో అబ్కారి అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. అక్కడ కేవలం శాంపిళ్లు తీస్తామని బెదిరించి డిపోల నుంచి ప్రతి నెల లక్షల మాముళ్లు ఎక్సైజ్ అధికారులకు వస్తుండటంతోనే వాటిని పట్టించుకోరని విమర్శలు ఉన్నాయి. బెల్ట్ షాపుల ద్వార జరిగే మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం, అధికారులకు నెల వారి మాముళ్లు వస్తుండగా కోత్తగా టార్గేట్ ల పేరిట బైండోవర్ లు చేయడం ఏమిటని బెల్ట్ షాపుల నిర్వహకులు వాపోతున్నారు.

Next Story

Most Viewed