- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్టంలోనే బాన్సువాడ నియోజకవర్గం నంబర్ వన్
దిశ, కోటగిరి : అభివృద్ధిలో బాన్సువాడ నియోజకవర్గం రాష్టంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కుల సంఘాల భవనాలు, ఫంక్షన్ హాల్‌ను, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు బాన్సువాడ నియోజకవర్గంలో పదకొండు వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా ఉన్నామని ఆయన అన్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఒక్క కోటగిరి మండల కేంద్రంలోనే సుమారు 30 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు చేసినట్టు తెలిపారు.
గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు లోన్లు అందుబాటులో ఉన్నాయని, ఎంతమంది నిర్మించుకుంటే అంతమందికి ఇస్తామని ఆయన అన్నారు. ఇంటి నిర్మాణం కోసం స్థలం లేని వారి కోసం కూడా ప్రభుత్వ స్థలంలో 80 గజాల జాగాతో పాటు ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షలు మంజూరు చేస్తామని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలు తెలపడం కోసం ఉదయం 9 గంటల లోపు తన నివాసానికి వస్తే సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీఆర్ఎస్ మండల నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, కుల సంఘాల పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.