- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జుక్కల్ నియోజకవర్గంను దోచుకున్నది దళితులే : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్
దిశ, పిట్లం : జుక్కల్ నియోజకవర్గాన్ని దోచుకున్నది ఇతర కులాల వారు కాదు, దళిత కుటుంబాలకు చెందిన వారేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పిట్లం మండల కేంద్రంలోని రాజ్య రాజేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బహుజన సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దళితుల పేరు చెప్పుకుంటూ ఎమ్మెల్యేలుగా పదవులు పొంది ఉన్నత వర్గాల వారికి తొత్తుగా మారుతున్న ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని అన్నారు. గతంలో ఉన్న పండరి , సౌదాగర్ గంగారం, అరుణతార, ఇప్పుడున్న హనుమంత్ షిండే నలుగురు దళిత సంఘాలలో వీధులలో ఎప్పుడైనా తిరిగారా ? ఎప్పుడు వచ్చినా రెడ్డిలు కాపులు కోమట్లు వారి ఇంటిలోకి పోయి మంతనాలు చేసి వారితో నీ కాలయాపన చేస్తున్నరని ఆయన ఎద్దేవా చేశారు.
దళితుల పేర్లు చెప్పుకుంటూ పదవులు పొందుతూ ఏ ఒక్క దళితున్ని కూడా ఇప్పటివరకు దగ్గరికి తీసిన పాపాన పోలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఆయన కూడా దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులను మోసం చేసిన వ్యక్తిగా చరిత్రకి ఎక్కాలని ఆయన అన్నారు. ఎన్నికలలో ఒక్కసారి దళిత కుటుంబాలలో తిరిగితే డబ్బులకు, క్వాటర్కు లొంగిపోతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఆయన గుర్తు చేశారు. బహుజనులమని పేరు చెప్పుకున్న మాత్రాన వారందరూ కూడా దళితులకు ఎప్పుడైనా న్యాయం చేశారా ? ఎన్నికలలో ఎస్సీ నియోజకవర్గం జుక్కల్ ఉన్నందున ఎస్సీలకు ఎప్పుడైనా న్యాయం జరిగేనా అని ప్రశ్నించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలలో నిజామాబాద్ జిల్లా నుండి వచ్చి చుక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా దళితులకు న్యాయం చేసిన పాపాన పోలేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి ఎంపిక చేసి జుక్కల్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కానీ ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా దళితుల కాలనీలలో గాని వారి దగ్గరకు వచ్చి మాట్లాడిన పాపన కూడా పోలేదని ఆయన అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవాలని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన కూడా పట్టించుకోలేదు. ఇలాంటివారు ఉన్నత వర్గ కులాల వారికే మద్దతు పలుకుతూ వారికే కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులను అప్పజెప్తారు కానీ దళితులకు ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలలు లేవని అన్నారు. ఇప్పుడే బహుజనులు మేలుకొని ఇలాంటి వారిని తరిమికొట్టేందుకే బీఎస్పీ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి పార్టీకి బయోపితం చేసి ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా బీఎస్పీ కార్యదర్శి గుల్లని సాయిలు, యువజన సంఘం నాయకుడు ఉపేందర్, నాయకులు వసంత, జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.