బాబూ.. బూస్ట్​ కావాలా....

by Sridhar Babu |
బాబూ.. బూస్ట్​ కావాలా....
X

దిశ, గాంధారి : గంజాయి విక్రయదారులు రూటు మార్చారు. బహిరంగంగా దానిని విక్రయిస్తున్నా ఎవరూ గుర్తుపట్టకుండా కోడ్​ భాషలో యువతను అడిగి అంటగడుతున్నారు. బాబూ బూస్ట్​ కావాలా....అంటూ విక్రయిస్తున్నారు. మరో పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంజాయి పై ఉక్కు పాదం మోపాలని పలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ మండలాల్లో ఇంకా అక్కడక్కడ కొన్ని గంజాయి అడ్డాలు సాగుతూనే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు అడ్డాలు గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి.

గంజాయితో చాలామంది యువత పేడదారి పడుతుంది. వీరు కోడ్ భాషలలో గంజాయిని పిలుస్తూ కొనుగోలు చేస్తున్నారు. బూస్ట్ పేరుతో విక్రయిస్తున్నారు. మార్నింగ్ బూస్ట్, లంచ్ బూస్ట్, డిన్నర్ బూస్ట్ గా గంజాయిని సేవిస్తున్నారు. నిర్మానుష్యమైన ప్రాంతంలో ఈ స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ గంజాయి సేవిస్తున్నారు. విక్రయదారులు కూడా అలాంటి ప్రదేశాలను ఎంచుకొని యువతకు విక్రయిస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేసి గంజాయి విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నా

Advertisement

Next Story