రైస్ మిల్లులపై దాడులు

by Kalyani |
రైస్ మిల్లులపై దాడులు
X

దిశ, భిక్కనూరు : అలాట్ చేసిన ధాన్యం బస్తాలు... మిల్లులలో రికార్డు ప్రకారం నిలువ ఉన్నాయా లేవా...? అన్న విషయమై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో పాటు, సివిల్ సప్లై అధికారుల స్పెషల్ టీం బృందాలు జిల్లాలోని రైస్ మిల్లులపై సోమవారం దాడులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం భవానీపేట్, భిక్కనూరు మండలం అంతంపల్లి సమీపంలోని సప్తగిరి రైస్ మిల్, సదాశివ నగర్ మండలం సమీపంలోని పద్మావతి రైస్ మిల్లులపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

మెదక్ జిల్లా సివిల్ సప్లై అధికారి బ్రహ్మ రావు, ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి, భిక్కనూరు తహసీల్దార్ కే. శివప్రసాద్, ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ కిష్టయ్య, భిక్కనూర్ ఎస్సై సాయి కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. మూడు రైస్ మిల్లులలో ఏకకాలంలో ప్రారంభమైన ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. మిల్లులలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను తప్పిల వారిగా లెక్కిస్తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. కేటాయించిన ప్యాడికి, మిల్లులలో ఉన్న స్టాక్ కరెక్ట్ గా ఉందా లేదా అన్న విషయమై లెక్కలు వేస్తున్నారు. ఈ దాడుల్లో జిల్లాకు చెందిన అధికారులు కాకుండా, మెదక్ జిల్లాకు చెందిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాకు పంపి తనిఖీలు చేయించడం సంచలనం రేకెత్తిస్తుంది.

Next Story

Most Viewed