విధుల్లో ఉన్న అటవీ శాఖ అధికారులపై దాడులు చేయడం హేయనీయం…

by Kalyani |
విధుల్లో ఉన్న అటవీ శాఖ అధికారులపై దాడులు చేయడం హేయనీయం…
X

దిశ, నిజామాబాద్ సిటీ: విధుల్లో ఉన్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై దాడి చేయడం హేయమైన చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అటవీశాఖ ఎస్ ఆర్ వో రవి మోహన్ భట్, జే ఆర్ వో నిజామాబాద్ అధ్యక్షుడు సుధాకర్ రావు తెలిపారు. శుక్రవారం మోపాల్ మండలంలోని కాల్పోల్లో ఫారెస్టు అధికారులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం నగరంలోని అటవీశాఖ కార్యాలయంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. అటవీ భూముల్లో చెట్లు నరికి ఆక్రమించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. విధి నిర్వహణలో భాగంగా తాము రాత్రనక, పగలనక దట్టమైన అడవుల్లో ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగకుండా అహర్నిశలు పని చేస్తామని అన్నారు.

కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు వ్యక్తులు దాడులకు దిగుతారని అలాంటి సమయంలో తాము ప్రతిఘటించడానికి ఏలాంటి వెపన్స్, ఆయుధాలు ఎవరి దగ్గర ఉండవని ప్రాణాలకు సైతం తెగించి బయటపడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి అటవీ శాఖ ఉద్యోగులకు, సిబ్బందికి ఆయుధాలు సమకూర్చేలా మేలు చేస్తే మేలు చేసిన వారవుతారన్నారు. అలాగే ప్రజలు అవగాహన పెంచుకోవాలని భూముల్లో చెట్లు నరికేసి ఆక్రమించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం అమాయక ప్రజలను రెచ్చ గొడుతుండడం వల్ల ప్రజలు ఇలా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది సరైన చర్య కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫారెస్ట్ అధికారుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ ఆర్ వో పద్మారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed