అంతర్ రాష్ట్ర మట్కా నిర్వాహకుడి అరెస్ట్

by Sridhar Babu |
అంతర్ రాష్ట్ర మట్కా నిర్వాహకుడి అరెస్ట్
X

దిశ, నిజామాబాద్ క్రైం : గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తున్న మొహమ్మద్ జమీర్ ను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమీర్ గత ఐదు సంవత్సరాలుగా తన బుకీల ద్వారా అనేకమంది అమాయక ప్రజలని మట్కా వ్యాపారంలోకి లాగి వారికి డబ్బు ఆశ చూపి కోట్ల రూపాయలలో మోసం చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధ, అకోలా, అమరావతి ఇంకా అనేక ప్రాంతాలలో మట్కా నిర్వాహకులతో తనకున్నటువంటి సంబంధాల ద్వారా మట్కాలో ప్రతిరోజూ విజేతలుగా రాబోయే నెంబర్లను తీసుకొని వాటిపై తన ఏజెంట్స్ బుకీల ద్వారా భారీ ఎత్తున బెట్టింగ్ చేసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.

నిందితుడు జమీర్ ముఖ్య అనుచరుల గురించి పోలీసు వారు తీవ్రంగా గాలిస్తున్నారు. అదేవిధంగా నిందితుడు జమీర్ కూడబెట్టిన ఆస్తులపై కూడా లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ప్రజలు మట్కా ఏజెంట్లని నమ్మి మోసపోవద్దని అదేవిధంగా మట్కా ఆడినా, నిర్వహించినా, బుకీలుగా వ్యవహరించినా చట్టరీత్యా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ సీఐలు అజయ్ బాబు, అంజయ్య , నార్త్ రూరల్ సీఐ సతీష్, ఐదవ పట్టణ ఎస్సై అప్పారావు , టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాములు, అనిల్, సుధాకర్, లక్ష్మన్న, రామచందర్, అజమ్ లను అభినందిస్తూ వీరికి రివార్డులు ఇవ్వనున్నట్టు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు.

Advertisement

Next Story